
ముంబైకర్లకు మరాఠీ తప్పనిసరేం కాదంటూ ఆరెస్సెస్ నేత సురేష్ భయ్యాజీ వ్యాఖ్య
మండిపడ్డ ప్రతిపక్షాలు... హుత్మాత్మ చౌక్ వద్ద నిరసన
మరాఠీయే ముంబై భాషంటూ ఎంవీయే అగ్రనేతల ఉద్ఘాటన
ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు విజయ్ వడేట్టివార్, భాయ్ జగ్‌తాప్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు.
బుధవారం ఘట్కోపర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్‌లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు
నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి
తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు. ఎంవీయే అగ్రనేతలు