rss leader
-
‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు పెట్టుకుంది. కానీ, గురి తప్పింది. అయితే ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితం వచ్చిందంటూ వ్యాఖ్యానించారాయన.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారాయన. అలాగే.. ప్రతిపక్ష ఇండియాకూటమిని కూడా ఆయన వదల్లేదు. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని కామెంట్ చేశారు.#Breaking: RSS slams Narendra Modi & the BJP for their arrogance.Taking a jibe at the Loksabha election results, RSS leader Indresh Kumar said that those who became arrogant didn’t get as much power as they were expecting, Prabhu Ram reduced their numbers.It’s open fight now! pic.twitter.com/mr7pnJtAFI— Shantanu (@shaandelhite) June 14, 2024ఇదిలా ఉంటే.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మెజారిటీ(272) కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం విఫలమైంది. కేవలం 241 సీట్లతో మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇదిలా ఉంటే.. మొన్నీమధ్యే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కిష్ట్వార్ పట్టణంలో ఆరెస్సెస్ నేత చంద్రకాంత్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయన వ్యక్తిగత భద్రతాధికారిని హత్య చేశారు. చంద్రకాంత్ వైద్య పరీక్ష కోసం స్ధానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరెస్సెస్ నేతకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ఆస్పత్రిలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు చంద్రకాంత్ భద్రతా అధికారి నుంచి తుపాకీని లాక్కుని చంద్రకాంత్ సహా ఆయన భద్రతా అధికారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల ఘటనలో చంద్రకాంత్ వ్యక్తిగత భద్రతాధికారి మరణించారు. ఆరెస్సెస్ నేతకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. -
‘ఏ క్షణంలోనైనా లాహోర్‌లోకి ప్రవేశిస్తాం’
నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశిస్తుందని, అందుకు కేంద్రం గతంలో చేసిన సర్జికల్ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుత పరిస్థితి-స్థితిగతులపై మాట్లాడుతూ.. 300 మంది ఉగ్రవాదులను ఏరివేశామంటూ దాయాది పాక్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండగా కేవలం మూడు, నాలుగు పర్యాలు చేసిన కీలక దాడుల్లోనే ఈ ఘటన సాధించామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ.. ఆర్మీకి, ఎన్ఐఏ నిఘా విభాగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేస్తూ పాక్‌ను దెబ్బతీసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందన్నారు. లాహోర్‌లో ఎప్పుడైనా మేం కాలుపెట్టగలమని తెలపడమే సర్జికల్ దాడుల సారాంశమని అభిప్రాయపడ్డారు. అఖండ భారతాన్ని పునర్నిర్మించాలని తాము కలలు కంటున్నామని.. నాగ్‌పూర్, లాహోర్లలో సొంత నివాసాలు కట్టుకోవాలనుందని మనసులో మాట బయటపెట్టారు. తుదిశ్వాస విడిచేవరకూ అఖండ భారత నిర్మాణం కోసం ఆరెస్సెస్ పని చేస్తుందన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ల భావజాలంతో నవ భారతం నిర్మితమౌతుందని ఇంద్రేష్ కుమార్ వివరించారు. (వైరల్ : భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వీడియో..!) -
కళ్ల ముందే కాల్చి చంపారు
అమృత్సర్ : ఈ మధ్య రాజకీయ హత్యలు దేశంలో ఏదో ఒక మూల నిత్యం జరుగుతున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం ఆ వర్గ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆర్ఎస్ఎస్ నేత హత్య కలకలం రేపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం హిందు సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. భరత్‌నగర్‌లోని ఓ మార్కెట్ సముదాయంలో ఆయన్ని నిన్న మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. తన స్నేహితుడితో ఆయన మాట్లాడుతన్న సమయంలో ఓ వ్యక్తి గన్ గురిపెట్టి కాల్చాడు. మొదటి బుల్లెట్‌కు ఆయన నేల మీద పడిపోగా.. మరో ఆగంతకుడు అతనికి జత చేరి ఇద్దరూ కలిసి విపిన్పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో విపిన్ పక్కనే వ్యక్తి వ్యక్తి భయంతో పారిపోయాడు. తన కళ్ల ముందే స్నేహితుడిని(విపిన్) కాల్చిచంపారని ఆ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ఘటనాస్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న దుకాణం సీసీ టీవీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు నమోదు అయ్యాయి. మొన్నీమధ్యే లూథియానాలో ఒకరిని, ఘాజీపూర్‌లో మరొకరిని ఇదే రీతిలో హత్య చేసిన విషయం తెలిసిందే. -
కళ్ల ముందే కాల్చి చంపారు
-
ఆర్ఎస్ఎస్ రిక్వెస్ట్‌కి కాంగ్రెస్ సీఎం ఓకే
సాక్షి, ఛండీగఢ్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నేత రవిందర్ గోసెయిన్ హత్య కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గత రాత్రి(గురువారం) తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి మేరకు గోసాని హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాం. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు పంజాబ్ పోలీసుల సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. On request of @RSSorg, I’ve ordered transfer of Gosain murder case to NIA for better coordination between central agencies & Punjab police. — Capt.Amarinder Singh (@capt_amarinder) October 19, 2017 ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన 60 ఏళ్ల రవిందర్ గోసెయిన్‌ను లూథియానా కైలాశ్ నగర్ సమీపంలో మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ ఘటన చోటుచేసుకోగా.. వెంనటే ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. అయితే ఆయన హత్య వెనక కుట్ర దాగుందని వాదిస్తూ ఎన్ఐఏ విచారణ కోసం ఆర్ఎస్ఎస్ పట్టుబట్టింది. దీంతో అందుకు పంజాబ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఙక మృతుడు గోసెయిన్ కుటుంబానికి ఐదు లక్షల పరిహారంతోపాటు, ఆయన నలుగురి పిల్లలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ఇదివరకే ప్రకటించారు. -
కన్నూర్ రక్త చరిత్ర!
⇒ ఎరుపు, కాషాయ పక్షాల మధ్య ఎడతెగని రక్తపాతం కొచ్చి: వందలాది ఆరెసెస్ కార్యకర్తల హత్యకు కారణమైన సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల నరికిన వారికి కోటి రూపాయలిస్తానని మధ్యప్రదేశ్ ఆరెసెస్ నేత కుందన్ చంద్రావత్ బహిరంగ ప్రకటనతో ఉత్తర కేరళ జిల్లా కన్నూర్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గత 45–50 ఏళ్లలో ఇక్కడ ఆరెస్సెస్–మార్క్సిస్టు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ‘వందలాది’Sమంది మరణించారని అంచనా. ముఖ్యంగా 1990ల నుంచి జరుగుతున్న కన్నూర్ హింసాకాండ పాశవికంగా మారింది. క్లాసురూముల్లో పాఠాలు చెబుతున్న సీపీఎం, ఆరెస్సెస్ నేతలను(ఉపాధ్యాయులు) విద్యార్థుల ముందే కత్తులు, గొడ్డళ్లతో నరకి చంపడం దేశ ప్రజలందరిని పదేళ్ల క్రితమే కలవరపరిచింది. ఎన్ని శాంతి సమావేశాలు పెట్టినా రెండు రాజకీయ పక్షాల మధ్య హింసకు ముగింపు లేకుండాపోయింది. వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న కన్నూర్ పూర్వపు మలబార్ (కేరళలో చేరక ముందు మద్రాసు రాష్ట్రం) జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. తొలితరం కమ్యూనిస్ట్ యోధుడు ఏకే గోపాలన్, సీపీఎం మాజీ సీఎం ఈకే నయనార్, ఇప్పటి సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ మాజీ సీఎం కె.కరుణాకరన్, కేంద్ర మాజీమంత్రులు ఇ. అహ్మద్, సీఎం ఇబ్రాహీం కన్నూర్‌లో పుట్టినవాళ్లే. హిందూ కుటుంబాల్లో పుట్టిన నేతల్లో ఒక్క నయనార్ తప్ప మిగిలిన ముగురూ బీసీ వర్గమైన ఈళవ(తియ్యా)లే. బీడీ పరిశ్రమతో మొదలైన వివాదం! 50 ఏళ్ల క్రితం ఇక్కడ బీడీ పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ రంగంలోని కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు పెంచడంలో కమ్యూనిస్టు కార్మిక సంఘాలు విజయం సాధించాక, గణేష్ బీడీ వర్క్స్ వంటి పెద్ద కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. మిగిలిన కంపెనీలు ఆరెసెస్ అనుకూల కార్మికులను కాంట్రాక్టు పద్ధతిపై చేర్చుకోవడంతో కాషాయ పరివార్, కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థల మధ్య విద్వేషాలు పెరిగాయి. మంగళూరుకు చెందిన ఓ మైనారిటీ వ్యాపారి కన్నూరుకు వాణిజ్యకార్యకలాపాలు విస్తరించడంతో స్థానిక హిందూ వ్యాపారుల నుంచి సంఘ్ పరివార్ సంస్థలకు సహకారం లభించింది. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. మైనారిటీల తరఫున కమ్యూనిస్టులు ‘నిలబడ్డారు.’ దాదాపు 70 ఏళ్ల క్రితమే రాజకీయ దాడులు ప్రారంభం 1948లో కన్నూరులో ఆరెస్సెస్ మూడో ఛీప్ ‘గురూజీ’ ఎంఎస్ గోల్వాల్కర్ ఊరేగింపులపై జరిగిన దాడులతో రాజకీయ హింస ఆరంభమైందని చెబుతారు. జిల్లాలోని తలసేరీలో 1971లో భారీగా జరిగిన హిందూ–ముస్లిం ఘర్షణలు రెండు పక్షాల మధ్య శాశ్వత ఘర్షణలకు పునాదివేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ హయాంలతో పోల్చితే సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ పాలనలోనే రాజకీయ ఘర్షణలు ఎక్కువ జరిగాయని మీడియా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 30 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో కల్లుగీత వృత్తిదారులైన తియ్యాలు 30 శాతం వరకూ ఉండడంతో సాంస్కృతిక సంస్థగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహా అన్నిపార్టీల నేతలు, క్రియాశీల కార్యకర్తలు తియ్యాలే. అందుకే సీపీఎం–ఆరెస్సెస్ ఘర్షణల్లో మరణించిన, గాయపడినవారిలో 90 శాతానికి పైగా ఈ కులంవారే ఉన్నారు. 14 శాతానికి పెరిగిన బీజేపీ ఓట్లు! దీంతో పాతికేళ్ల నుంచీ జిల్లాలో బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకుంది. ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు గెలిచే బలం ఎక్కడా లేకున్నా 2016 ఎన్నికల్లో సగటున దాదాపు 14 శాతం ఓట్లను ‘కమలం’ అభ్యర్థులు సాధించారు. 1930ల నుంచీ అంటే దాదాపు 95 ఏళ్లుగా ‘ఎర్రకోట’గా పేరొందిన కన్నూరు జిల్లాలో కాషాయ బలగాల విస్తరణను ‘కత్తికి కత్తితో’ కామ్రేడ్లు ప్రతిఘటించడంతో రాజకీయ హత్యలు గత పదేళ్లుగా విపరీతంగా పెరిగాయి. 2000– 2016 మధ్య 66 రాజకీయ హత్యలు జరిగాయి. 2008లో అత్యధికంగా 14 జరిగితే, 2003, 2013లో మాత్రమే ఎలాంటి హత్యలు జరగలేదు. 2016లో రెండు పక్షాల మధ్య దాదాపు 600 రాజకీయ ఘర్షణలు జరగ్గా అందులో ఏడుగురు మరణించారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడే ఘర్షణలు పెరగడం, ఇది సీఎం విజయన్ సొంత జిల్లా కావడంతో రాజకీయ కొట్లాటలకు స్వస్తి పలకడానికి ఎల్డీఎఫ్ సీఎం కిందటేడాది శాంతి సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఉజ్జయిన్ ఆరెస్సెస్ సహ ప్రచార్ ప్రముఖ్ చేసిన ప్రకటనతో సంఘ్‌పరివార్‌కు ప్రచారపరమైన నష్టం జరిగిందనే విషయం నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలో కన్నూరు రాజకీయ ఘర్షణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి కన్నూర్ రాజకీయ ఘర్షణలు 1970లు, 80ల్లో ఖమ్మం జిల్లాలో సీపీఎం, సీపీఐ కార్యకర్తల మధ్య, వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో అప్పటి సీపీఎం ఎమ్మెల్యే మద్దికాయల ఓకాంర్ అనుచరులు,æ సీపీఐఎంఎల్–పీపుల్స్‌వార్ మధ్య, ఇంకా నల్లగొండ జిల్లా సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతంలో కాంగ్రెస్(మాజీ ఎమ్మెల్యే చకిలం శ్రీనివాసరావు నేతృత్వంలో), సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు పాత తరం రాజకీయ పరిశీలకులకు గుర్తుకు తెప్పిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేరళ సీఎం తల నరికితే కోటి
-
కేరళ సీఎం తల నరికితే కోటి
ఆరెస్సెస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు ఉజ్జయిని/కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు కోటి రూపాయలు విలువ చేసే తన ఇంటిని బహుమతిగా ఇస్తానని మధ్యప్రదేశ్‌లో ఓ ఆరెస్సెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఆరెస్సెస్ సహా సీపీఎం, కాంగ్రెస్ ఖండించాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడి తన పర్యటనలకు దూరంగా ఉండనని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఉజ్జయినికి చెందిన కుందన్ చంద్రావత్ అనే ఆరెస్సెస్ నాయకుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేరళ ముఖ్యమంత్రి మన ఆరెస్సెస్ కార్యకర్తలను చంపుతున్నాడు. ఇప్పటికి 300 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ సీఎం తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు నా ఇంటిని రాసిస్తా’ అని కుందన్ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుందన్ వ్యాఖ్యలతో ఆరెస్సెస్ వెంటనే విభేదించింది. ‘మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంఘ్ హింసా మార్గంలో నడవదు. అయితే కేరళలో మా కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై శాంతియుత మార్గంలోనే మేం నిరసన తెలుపుతాం’ అని ఆరెస్సెస్ జాతీయ నాయకుడు జె.నందకుమార్ ఢిల్లీలో చెప్పారు. అసలు కుందన్ ఎవరో తనకు తెలియదని నంద అన్నారు -
సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!
కొచ్చి: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళ్లాచీలో గురువారం రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం. సీఎం విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బాంబు దాడి కచ్చితంగా సీపీఎం కార్యకర్తల పనే అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు. ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత -
కేరళ సీఎంపై RSS నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆర్ఎస్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం
జలంధర్: పంజాబ్ లో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బిగ్రేడియర్(రిటైర్డ్) జగదీశ్ గగనేజపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. జలంధర్ లోని జ్యోతి చౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి కారులో వెళుతున్న జగదీశ్ పై బైకుపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన దేహంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. జగదీశ్ పై దాడిని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఖండించారు. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెంచారు. -
'రిజర్వేషన్‌ను వదులుకుంటున్నా.. ఇక జనరల్‌గానే '
పాట్నా: తాను రాజకీయాల్లో పోటీచేసేందుకు రిజర్వేషన్ ఉపయోగించుకోనని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయబోమని, జనరల్ స్థానాల నుంచే పోటీ చేస్తామని చెప్పారు. 'రిజర్వేషన్ లబ్ధిని పొందకూడదని మేం నిర్ణయించుకున్నాం. మాలో ఎవరు బలహీనమైనవారు ఉన్నారో వారే దానిని పొందడానికి అర్హులు అని మాంఝీ చెప్పాడు. మాంఝీ మహాదళిత్ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రిజర్వేషన్ సీటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనే స్వయగా రిజర్వేషన్ అనేది నిజంగా అభివృద్ధి చెందని వారికి దక్కాల్సినదని, అందుకే తాను రిజర్వేషన్ నుంచి పక్కకు జరిగి జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. బలహీన వర్గాల్లో ఉన్నతులుగా మారినవారు తమ ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో తమ రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆరెస్సెస్ లీడర్ హత్య
కుంతి(జార్ఖండ్): ఓ ఆరెస్సెస్ నాయకుడిపై జార్ఖండ్‌లో అనుమానిత వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుంతి జిల్లాలోని గుడిజోరా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరంబీర్ మహతో అనే 21 ఏళ్ల ఆరెస్సెస్ నాయకుడు తన గ్రామానికి మోటర్ సైకిల్ పై వస్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతడు ప్రాణాలుకోల్పోయాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రభుత్వానికి విలువల్లేకుండా పోయాయి...
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ మాజీ కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య ఎన్డీయే ప్రభుత్వంపై మరోసారి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులైన మంత్రులను వెనకేసుకు రావడం ద్వారా విలువలకు తిలోదకాలు ఇచ్చేసిందని మండిపడ్డారు. అధికార వ్యామోహం తప్ప ప్రజల మీద మమకారం లేదని వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వసుంధర రాజేపై వేటువేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే వాదనలను ఆయన ఖండించారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో పార్టీని తన భుజస్కంధాలపై మోసుకొని నడిపించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని అభిప్రాయపడ్డారు. మరింత విజ్ఞతతో వ్యవహరించి వ్యక్తిగత గౌరవాన్ని, పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని మోదీని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ - ఆర్ఎస్ఎస్ సాన్నిహిత్యంపై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పాలనపై ఆర్ఎస్ఎస్ విశ్వాసం మరింత క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని గోవిందాచార్య తప్పుబట్టారు. -
'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా'
విజయవాడ: తాను కబడ్డి ఆడేందుకు వెళ్లి... ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత దుర్గాప్రసాద్ స్మారక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఎస్‌లో చేరిన నాటి సంగతులతో ఆపటు దుర్గాప్రసాద్‌తో తనకు గల అనుబంధాన్ని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు. మనలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే విదేశీ దాడులు జరుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వగురు స్థానంలో భారత్‌ను చేర్చాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. రాముడు ఆదర్శపాలకుడని... అలాంటి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. -
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత టీవీ దేశ్‌ముఖ్ కన్నుమూత
ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు టీవీ దేశ్‌ముఖ్ (68) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఆయన క్షేత్ర సంఘచాలక్‌గా వ్యవహరించారు. గత రెండేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నగరంలోని ఆయన ఇంట్లో సంతాప సభ నిర్వహించారు. ఆ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. -
ఎన్డీఏ చైర్మన్‌గా నరేంద్ర మోడీ!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అచరించాల్సిన వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ తన కసరత్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్‌తో ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోని గురువారం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా పార్టీలో అత్యంత సీనియర్ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్‌ల ప్రాధాన్యతతోపాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతర వ్యూహంపై చర్చించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఓ వేళ తక్కువ మెజార్టీ వస్తే అనుసరించాల్సిన విధాలపై చర్చ కొనసాగింది. అందుకోసం తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్లను బీజేపీలోకి తీసుకోవాల్సిన అంశంపై కూడా చర్చ జరిగింది. బీజేపీలో రెండు పవర్ సెంటర్లు ఉండొద్దని మోడీ వ్యాఖ్యలపై రాజనాథ్, సోనిల మధ్య ఈ సందర్బంగా ప్రస్తావించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చైర్మన్‌గా గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ దిశగా బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు.