సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అచరించాల్సిన వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ తన కసరత్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్తో ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోని గురువారం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా పార్టీలో అత్యంత సీనియర్ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్ల ప్రాధాన్యతతోపాటు లోక్సభ ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతర వ్యూహంపై చర్చించారు.
అలాగే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఓ వేళ తక్కువ మెజార్టీ వస్తే అనుసరించాల్సిన విధాలపై చర్చ కొనసాగింది. అందుకోసం తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్లను బీజేపీలోకి తీసుకోవాల్సిన అంశంపై కూడా చర్చ జరిగింది. బీజేపీలో రెండు పవర్ సెంటర్లు ఉండొద్దని మోడీ వ్యాఖ్యలపై రాజనాథ్, సోనిల మధ్య ఈ సందర్బంగా ప్రస్తావించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చైర్మన్గా గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ దిశగా బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఎన్డీఏ చైర్మన్గా నరేంద్ర మోడీ!
Published Thu, May 15 2014 12:04 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement