'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా' | Venkaiah naidu attend rss leader's Durgaprasad memorial meeting in vijayawada | Sakshi
Sakshi News home page

'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా'

Published Sun, Nov 30 2014 11:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా'

'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా'

విజయవాడ: తాను కబడ్డి ఆడేందుకు వెళ్లి... ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత దుర్గాప్రసాద్ స్మారక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఎస్లో చేరిన నాటి సంగతులతో ఆపటు దుర్గాప్రసాద్తో తనకు గల అనుబంధాన్ని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు.

మనలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే విదేశీ దాడులు జరుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వగురు స్థానంలో భారత్ను చేర్చాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. రాముడు ఆదర్శపాలకుడని... అలాంటి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement