కుంతి(జార్ఖండ్): ఓ ఆరెస్సెస్ నాయకుడిపై జార్ఖండ్లో అనుమానిత వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుంతి జిల్లాలోని గుడిజోరా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరంబీర్ మహతో అనే 21 ఏళ్ల ఆరెస్సెస్ నాయకుడు తన గ్రామానికి మోటర్ సైకిల్ పై వస్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్లపై వచ్చి కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతడు ప్రాణాలుకోల్పోయాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.