కళ్ల ముందే కాల్చి చంపారు | Another RSS Leader Shot Dead in Amritsar | Sakshi
Sakshi News home page

మరో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత హత్య కలకలం

Published Tue, Oct 31 2017 8:13 AM | Last Updated on Tue, Oct 31 2017 8:20 AM

Another RSS Leader Shot Dead in Amritsar

అమృత్‌సర్‌ : ఈ మధ్య రాజకీయ హత్యలు దేశంలో ఏదో ఒక మూల నిత్యం జరుగుతున్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే లక్ష్యంగా వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం ఆ వర్గ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత హత్య కలకలం రేపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగం హిందు సంఘర్ష్‌ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్‌ కుమార్‌ ​దారుణ హత్యకు గురయ్యారు. భరత్‌నగర్‌లోని ఓ మార్కెట్‌ సముదాయంలో ఆయన్ని నిన్న మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. తన స్నేహితుడితో ఆయన మాట్లాడుతన్న సమయంలో ఓ వ్యక్తి గన్‌ గురిపెట్టి కాల్చాడు. మొదటి బుల్లెట్‌కు ఆయన నేల మీద పడిపోగా.. మరో ఆగంతకుడు అతనికి జత చేరి ఇద్దరూ కలిసి విపిన్‌పై కాల్పులు జరిపారు. 

ఆ సమయంలో విపిన్‌ పక్కనే వ్యక్తి వ్యక్తి భయంతో పారిపోయాడు. తన కళ్ల ముందే స్నేహితుడిని(విపిన్‌) కాల్చిచంపారని ఆ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ఘటనాస్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న దుకాణం సీసీ టీవీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు నమోదు అయ్యాయి.  మొన్నీమధ్యే లూథియానాలో ఒకరిని, ఘాజీపూర్‌లో మరొకరిని ఇదే రీతిలో హత్య చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement