ఆటో డ్రైవర్‌గా మారిన మైక్రోసాఫ్ట్‌ ఇంజనీర్‌..ఎందుకంటే..? | Microsoft Engineer Drives Namma Yatri Auto On Weekends To Overcome Loneliness | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌గా మారిన మైక్రోసాఫ్ట్‌ ఇంజనీర్‌..ఎందుకంటే..?

Published Mon, Jul 22 2024 3:53 PM | Last Updated on Mon, Jul 22 2024 4:17 PM

Microsoft Engineer Drives Namma Yatri Auto On Weekends To Overcome Loneliness

ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్‌గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్‌ మీడియా ఎక్స్‌లో వేంకటేశ్‌ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్‌లో పనిచేస్తున్న వేంకటేశ్‌ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. 

ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. 

అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్‌ మైక్రో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్‌ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. 

గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌)లో జావా డెవలపర్‌గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్‌ రైడర్‌గా మారినట్లు చెప్పడం గమనార్హం. 

 

(చదవండి: నేషనల్‌ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement