సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి.
క్వాడ్రి సైకిల్
బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్‌ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్‌లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది.
క్యూట్
క్వాడ్రిసైకిల్‌ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్‌లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది.
పైలట్ ప్రాజెక్ట్
బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్‌లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి.
త్వరలో హైదరాబాద్
ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్.
Comments
Please login to add a commentAdd a comment