Hyderabad Rains: Roads Flooded Heavy Traffic, Cab Services Surged Prices - Sakshi
Sakshi News home page

వానొస్తే జనం గుండెల్లో గుబుల్‌.. హైదరాబాద్‌లో క్యాబ్‌ ధరలు డబుల్‌! వైరల్‌గా మారిన ట్వీట్‌

Published Thu, Jul 20 2023 8:07 PM | Last Updated on Thu, Jul 20 2023 8:45 PM

Hyderabad Rains Roads Flooded Heavy Traffic Cab Services Surged Prices - Sakshi

ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన! ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా! వర్షం సినిమాలో పాట మాదిరి వానపడినపుడు హాయిగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రాంతాల్లోని జనం మనసుల్లో గిలిగింతలుగొలిపే సన్నివేశం. కానీ, హైదరాబాదీలకు మాత్రం బాధలు పంచే సందర్భం.

ఎలాగంటే, జీహెచ్‌ఎంసీ అధికారులు ఓవైపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వరద నియంత్రణకు చర్యలు చేపట్టాం అని చెప్తుంటారు. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించవు. చిన్నపాటి వర్షానికే భాగ్యనగరంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక వాహనదారుల కష్టాలు మామూలే. మామూలుగానే మన నగరంలో ట్రాఫిక్‌ ఎక్కువ. వాన పడిందా రచ్చ రచ్చే! ఎడతెరిపి లేకుండా వాన పడిందా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు తప్పవు. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు.
(చదవండి: వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!)

అటు ఆకాశానికి, ఇటు జేబుకు చిల్లు!
నగరంలో జోరు వాన. అరే! వానలో తడుస్తూ బైక్‌పై ఎలా? క్యాబ్‌లో వెళ్దామనే ఆలోచనే చేసే పరిస్థితిలో సామాన్య జనం లేరు. ఎందుకంటే ఇదే అవకాశంగా క్యాబ్‌ యజమానులు అమాంతం చార్జీలు పెంచేశారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండింతలు, మూడింతల సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, బేగంపేట ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 చార్జీ ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ధరలు డబుల్‌ అయ్యాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో క్యాబ్‌ సర్వీసుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్తూ అనుజ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.   @AnujGurwara అనే ట్విటర్‌ యూజర్ వర్షం పడటంతో చార్జీలను ఎలా పెంచేశారో తన స్వీయ అనుభవాన్ని షేర్ చేశాడు. ఈక్రమంలోనే పలువురు నెటిజన్లు కూడా అధిక చార్జీల బాధలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ విభాగం హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌: ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement