హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ | Software engineer saves rs 40000 month post viral | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్

Published Thu, Sep 7 2023 8:00 AM | Last Updated on Thu, Sep 7 2023 8:19 AM

Software engineer saves rs 40000 month post viral - Sakshi

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగళూరు టెక్ హబ్‌గా అవతరించింది, అయితే భాగ్యనగరం (హైదరాబాద్) ఇప్పుడిప్పుడే వేగంగా ఈ దిశవైపు పరుగులు పెడుతోంది. కాగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువగా ఉంటాయని ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నెలకు రూ. 40,000 ఆదా చేస్తున్నట్లు, దీంతో చాలా హ్యాప్పీగా గడుపుతున్నట్లు పోస్ట్ చేసాడు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు నిజమే అని అతని మాటలతో ఏకీభవించగా.. మరి కొందరు ఇదెలా సాధ్యం, ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కొంతమంది బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడున్నారు, ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా రెంట్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి రూ. 40వేలు ఎలా ఆదా చేస్తున్నావని ఒక నెటిజన్ అడగగా దానికి రిప్లై ఇస్తూ రెంట్, మెయింటెనెన్స్, వాటర్, కరెంట్ బిల్ అని వెల్లడించాడు.

ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు!

బెంగళూరులో అయినా.. హైదరాబాద్‌లో అయినా ఉన్న ప్రాంతన్ని బట్టి ఇంటి అద్దె ఉంటుంది. ఇక నిత్యావసరాలు, ప్రయాణ చార్జీలు ఇలా తీసుకుంటే ఎక్కడైనా దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement