రేషన్ వద్ద లేదా ఏదైనా పండగలప్పుడూ గుడి వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే జనాలు అంతలా రద్దీగా ఉంటారు. అలాంటిది ఏమి లేకుండా..అది కూడా సాధారణ రోజుల్లో జనాలు బారులు తీరి ఉంటే..కచ్చితంగా అనుమానం వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంతలా జనాలు బారులుతీరి ఉన్నారనే సందేహం కలుగక మానదు. ఇంతకీ వారు ఎందుకలా బారులు తీరి నుంచొన్నారో వింటే మాత్రం కంగుతింటారు.
వివరాల్లోకెళ్తే..ముంబైలో ప్రజలే అంతలా బారులుతీరి ఉన్నారు. అది కూడా ఆటో రిక్షా కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక అలా నుంచొని ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ముంబైలో మౌలిక సదుపాయాలు లేవుగాని పెద్ద సంఖ్యలో కార్లు ఉన్నాయని ఒకరు, ఇది ముంబై స్పీరిట్ అని మరొకరు కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.
The Auto Rickshaw queue in Dombivli during evening peak hours showcases people's remarkable patience. #MumbaiRains #MumbaiSpirit pic.twitter.com/i7Pgv21peZ
— Godman Chikna (@Madan_Chikna) June 29, 2023
Comments
Please login to add a commentAdd a comment