సినిమాలపై మోజులు చాలామంది కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి నగరాలకు వస్తారు. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతారు. చివరకు ఏదోలా సినిమా చాన్స్ వచ్చినా.. తర్వాత నిలదొక్కుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరికొంత మంది రోడ్ల పక్కన, బస్టాండ్స్‌లో చాయ్, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తెరపై వినోదాన్ని అందించే సినీనటులు.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపై ఉంటూ.. చివరకు ఆటోలోనే మృతిచెందాడు. హృదయ విచారకర ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమిళ నటుడు విరుత్చకాకాంత్ బాబు ఆటోలోనే తనువు చాలించాడు. తమిళ హీరో భరత్ నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాలో విరుత్చకాకాంత్ బాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయిన విరుత్చకాకాంత్ బాబు.. కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. రూమ్ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. సినిమా అవకాశాలు లేక, తిండి దొరక్క చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment