థానె: మహారాష్ట్రలో థానెలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
తినుబండారాలు కొనేందుకు వెళ్లిన చిన్నారిని, ఇంటి పక్కనే ఉండే మహ్మద్ నాసిర్ అబ్దుల్ రషీద్ షేక్ (48) అనే కార్మికుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. రషీద్ ఆ అమ్మాయిని రోడ్డు పక్కన ఆపిన ఉన్న ఆటోలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి పరిగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఆటోలో చిన్నారిపై దారుణం
Published Mon, Oct 24 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement
Advertisement