భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
శభాష్ పోలీస్..
ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్‌కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్‌లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
బాధ్యతారాహిత్యం..
సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరణశిక్ష విధించండి..
ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య
Comments
Please login to add a commentAdd a comment