పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే? | Drunk Man Sits On Firecracker In Bet For New Vehicle In Bengaluru, Explosion Kills Him | Sakshi
Sakshi News home page

పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Published Tue, Nov 5 2024 9:17 AM | Last Updated on Tue, Nov 5 2024 9:58 AM

Man Sits On Firecracker In Bet in Bengaluru

 బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి  ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32)‌ అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్‌కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్‌ కార్డ్‌ బోర్డ్‌ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్‌ ఇచ్చారు.

చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూ

దీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్‌ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్‌ బోర్డ్‌పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్‌ బోర్డ్‌ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.

శబరీష్‌ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్‌ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్‌ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement