సల్మాన్ మాదిరే సంజయ్ కూడా.. | After Salman Khan, Sanjay Dutt rides an autorickshaw | Sakshi
Sakshi News home page

సల్మాన్ మాదిరే సంజయ్ కూడా..

Published Fri, Mar 25 2016 6:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ మాదిరే సంజయ్ కూడా.. - Sakshi

సల్మాన్ మాదిరే సంజయ్ కూడా..

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాదిరే మరో హీరో సంజయ్ దత్ పయనించాడు. ఇదేదో సినిమాలకు సంబంధించిన వ్యవహారం కాదు. గత డిసెంబర్లో ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్లి సల్మాన్ అందర్నీ ఆశ్చర్యపరచగా.. బుధవారం రాత్రి సంజయ్ కూడా ఇదే తరహాలో ఇంటికి వెళ్లాడు.

సంజయ్ తన భార్య మాన్యత, స్నేహితులతో కలసి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. డిన్నర్ చేశాక రెస్టారెంట్ బయటకు వచ్చిన సంజయ్ తన రోల్స్ రాయ్సె కారు కోసం వేచిచూడకుండా దగ్గరలో ఉన్న ఆటో తీసుకుని స్నేహితుడితో కలసి ఇంటికి వెళ్లాడు. ఆటో చార్జీ 146 రూపాయలు కాగా సంజయ్ 300 రూపాయలు ఆటోవాలాకు ఇచ్చాడు. సంజయ్ స్నేహితుడు మరో 100 రూపాయలు ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement