
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్‌కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650
మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్‌ఏ దశాబ్దాల తరువాత భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg
— anand mahindra (@anandmahindra) August 20, 2024