BSA Motorcycles
-
భారత్‌లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
భారత్‌లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది. -
యెజ్డీ మళ్లీ వచ్చింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుర్రకారును 90వ దశకం వరకు ఉర్రూతలూగించిన చెక్ బ్రాండ్ యెజ్డీ బైక్స్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఒకేసారి మూడు మోడళ్లు గురువారం ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ ఉన్నాయి. 26 ఏళ్ల విరామం తర్వాత పోటీ ధరతో యెజ్డీ కొత్త జర్నీ ప్రారంభించడం విశేషం. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ భారత్‌లో జావా, బీఎస్‌ఏతోపాటు తాజాగా యెజ్డీ బ్రాండ్‌ను పరిచయం చేసింది. 1996 వరకు యెజ్డీ బైక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, కేటీఎంకు ఇప్పుడు యెజ్డీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ధర మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.1.98 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఉన్న ప్లాం టులో ఇవి తయారవుతున్నాయి. ఏటా 5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇవీ ఫీచర్ల వివరాలు.. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోడళ్లు 334 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ ఇంజిన్‌తో తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, కాన్స్టాంట్ మెష్ 6 స్పీడ్ గేర్ బాక్స్, ఏబీఎస్, 29.1–30.2 పీఎస్ పవర్, డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. ట్యాంక్ సామర్థ్యం మోడల్‌నుబట్టి 12.5–15.5 లీటర్లు. బరువు 182–188 కిలోలు. సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్‌తో అడ్వెంచర్, ట్విన్ ఎగ్జాస్ట్‌తో మిగిలిన రెండు మోడళ్లు రూపుదిద్దుకున్నాయి. విస్తృత స్థాయిలో 14 రంగులు కస్టమర్లను అలరించనున్నాయి. రూ.5 వేలు చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సైతం మొదలైనట్టు క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా ఈ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ పునరుద్ధరణ, డిజైన్, ఆర్అండ్డీ, పారిశ్రామికీకరణకు క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. It's not a motorcycle, it's an emotion. It's an era. It's a way of life. And we're back, thundering thrice in three new avatars! Book your test rides now - https://t.co/esLonZ0DEr .#NotForTheSaintHearted #Yezdi #YezdiIsBack #YezdiMotorcycles #YezdiForever pic.twitter.com/WvwiiVoA2Z — yezdiforever (@yezdiforever) January 13, 2022 -
బీఎస్ఏ మోటార్స్ నుంచి సరికొత్త బైక్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
బీఎస్ఏ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. హీరో సైకిల్స్ తరువాత బీఎస్ఏ సైకిల్స్ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణను పొందాయి. సైకిళ్లతో పాటుగా బైక్‌లను కూడా బీఎస్ఏ తయారుచేసేది. 1970లో బీఎస్ఏ తన ఉత్పత్తులను నిలిపివేయగా..2016లో మహీంద్రా గ్రూప్స్ బీఎస్ఏ మోటర్స్‌ను దక్కించుకుంది. రెట్రో బైక్ లవర్స్ కోసం ఇప్పుడు సరికొత్త బైక్‌తో బీఎస్ఏ మోటార్స్ ముందుకు రానుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ భాగస్వామ్యంతో తమ మొదటి కొత్త జెన్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కొత్త బీఎస్ఏ మోటార్‌సైకిల్‌ను యూకే బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటార్స్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ఈ బైక్‌కు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కు పోటీగా.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 గోల్డ్ స్టార్ 650 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగిఉంటుంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650కు పోటీ ఇవ్వనుంది. 2022 బీఎస్ఏ గోల్డ్ స్టార్ ఒరిజినల్ గోల్డ్ స్టార్ బైక్‌ను పోలి ఉంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ షేప్‌తో ఫ్యూయల్ ట్యాంక్, లార్జ్ ఎయిర్‌బాక్స్, ఎగ్జాస్ట్ పైప్, రియర్‌వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లతో కస్టమర్లకు ఇట్టే కట్టిపడేస్తుంది. And here’s a glimpse into its making… #BSAisBack @bsamotorcycles_ pic.twitter.com/Z2zns2tmt3 — anand mahindra (@anandmahindra) December 5, 2021 చదవండి: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!