రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులుపెడుతూ విశ్వనగరంగా విరాజిల్లుతున్న 'భాగ్యనగరం' (హైదరాబాద్) రానున్న రోజుల్లో దేశానికే తలమానికం కానుందా.. అన్నట్లు ఎదుగుతోంది. దీనికి కారణం దిగ్గజ సంస్థలు తమ దృష్టిని హైదరాబాద్ ఆకర్శించడమే! ఇటీవల హైదరాబాద్‌ను ఉద్దేశించి 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) చేసిన ఒక ట్వీట్‌కు మంత్రి 'కేటీఆర్' (KTR) రిప్లై ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పుడు.. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసుకుందంటే.. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించినది మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక రాజకీయాలకు ప్రాధాన్యముందని, ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇస్తూ.. డియర్ ఆనంద్ జీ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని మీకు తెలుసా? అంతే కాకుండా యాపిల్, మెటా, క్వాల్‌కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే నేను దీనిని #HappeningHyderabad అని పిలుస్తాను, అంటూ రిప్లై ఇచ్చారు.
ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
నిజానికి 2015లో కేటీఆర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2022లో ఈ గూగుల్ భవన నిర్మాణానికి ఐటీ మినిష్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సుమారు 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ తన క్యాంపస్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి.
Dear Anand Ji,
— KTR (@KTRBRS) November 10, 2023
Did you know that the World’s Largest campus of Amazon is located in Hyderabad?
Also the second largest campuses of Apple, Meta, Qualcomm, Micron, Novartis, Medtronic, Uber, Salesforce and many more have also been setup in Hyderabad in the last 9 years
That’s… https://t.co/nPXJtCX24S pic.twitter.com/bozaJYSrrx
Comments
Please login to add a commentAdd a comment