ఉదయ్ కోటక్ రాజీనామా.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్! | Anand mahindra tweet about uday kotak | Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఉదయ్ కోటక్ రాజీనామా.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!

Published Sun, Sep 3 2023 3:35 PM | Last Updated on Sun, Sep 3 2023 3:57 PM

Anand mahindra tweet about uday kotak - Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి పరిచయమే అవసరం లేదు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఉదయ్ కోటక్' రాజీనామా సందర్భంగా తన ట్విటర్ ద్వారా ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉదయ్ కోటక్ 1985లో కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత 2003లో బ్యాంక్‌గా అవతరించింది. నిజానికి రెండు కార్పొరేట్ సంస్థల పేర్లను కలిగిన ఏకైక భారతీయ బ్యాంక్ ఈ కోటక్ మహీంద్రా కావడం గమనార్హం. ప్రారంభంలో కోటక్ ఆర్థిక సంస్థను ప్రారంభించాలని యోచిస్తున్నప్పుడు.. అందులో మహీంద్రా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా ప్రకటించినప్పుడు.. ప్రారంభంలో ఉదయ్ కోటక్‌తో ఆనంద్ మహీంద్రాకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్

ఆనంద్ మహీంద్రా.. ఉదయ్ కోటక్ గురించి మాట్లాడుతూ.. 'అప్పట్లో అల్లాయ్ స్టీల్ పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. అప్పుడు అతను ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడని నేను అతనిని అడిగాను. కంపెనీ మేనేజ్‌మెంట్ రెండింటినీ అధ్యయనం చేసాను, అంతే కాకుండా నా డబ్బు సురక్షితంగా ఉంటుందని సమాధానమిచ్చాడు. మహీంద్రా ఇరవైల వయస్సులోనే అతనిలోని ప్రత్యేకమైన సంకేతాలను స్పష్టంగా చూశానన్నాడు. అయితే అతని స్టోరీకి ముగింపు లేదు. ఉదయ్ భారతీయ ఆర్థిక సేవల పరిశ్రమపై ప్రభావం చూపే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇక్కడ మరిన్ని సాహసాలు ఉన్నాయి, నా మిత్రమా.. అంటూ ట్వీట్ చేసాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement