మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ ఆసక్తికరమైన 'త్రీ-వీలర్' వీడియోను ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇది ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉండటం చేత నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో చిన్న త్రీ-వీలర్ వెహికల్ చూడవచ్చు. ఇది మాన్‌హట్టన్‌లో కనిపించిన దృశ్యం. ఇలాంటి వాహనాన్ని భారత్ కూడా ఏదో ఒక రోజు తయారు చేస్తుందని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
వీడియోలో కనిపిస్తున్న వాహనం, కారు మాదిరిగా స్టీరింగ్ వీల్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా ఇలాంటి వాహనాలను రేసింగ్‌లలో ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇలాంటి వాహనాలు భారతదేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు, కానీ భవిష్యత్తులో విడుదలవుతాయా? లేదా? అనేది ప్రశ్నార్థకం.
I spot this ‘three wheeler’ in Manhattan. It’s no commercial rickshaw! And it’s certainly not about last~mile-mobility. This one has style oozing out of it. One day from an Indian company? After all, we’re the global heavyweights in 3-wheelers…🙂 @sumanmishra_1 pic.twitter.com/tWsdte0Ny6
— anand mahindra (@anandmahindra) October 28, 2023
Comments
Please login to add a commentAdd a comment