క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా | Anand Mahindra Impressed With Portable Road Being Laid For Ease Of Transport Of Vehicles, Video Goes Viral - Sakshi
Sakshi News home page

క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Published Wed, Jan 17 2024 9:07 PM | Last Updated on Thu, Jan 18 2024 9:56 AM

Anand Mahindra Impressed With Portable Roads Video Viral - Sakshi

ఆనంద్ మహీంద్రా ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రోడ్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా నిమిషాల్లో రోడ్డు వేయడానికి రూపోంచిన రోడ్‌వే కిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో సులభంగా రోడ్డుని ఏర్పాటు చేసుకోవచ్చు, వాటి ద్వారా సహాయక చర్యల కోసం వాహనాలను, పరికరాలను సులభంగా రవాణా చేయవచ్చని ఆనంద్ మహీంద్రా అన్నారు.

వీడియో షేర్ చేస్తూ ఇది ఎంతో అద్భుతంగా ఉంది, కఠినమైన భూభాగాల్లో సైన్యం సులభంగా ముందుకు వెళ్ళడానికి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..

వీడియోలో గమనించనట్లయితే.. రోడ్‌వే కిట్ మార్ష్‌ల్యాండ్, మంచు, ఇసుక, రివర్ ఫోర్డింగ్ వంటి ప్రాంతాల్లో కూడా సులభంగా తాత్కాలిక రోడ్డుని నిర్మించగలదు. అవసరం తీరిన తరువాత దీనిని మళ్ళీ చుట్టి తీసుకెళ్లిపోవచ్చు. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement