Lion Vs Man: Anand Mahindra Shares Video Of A Lion Moving Towards A Man, Ask Two Questions - Sakshi
Sakshi News home page

Anand Mahindra: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో

Published Tue, Jun 13 2023 11:45 AM | Last Updated on Tue, Jun 13 2023 12:56 PM

Anand Mahindra post Scaring Netizens viral video - Sakshi

భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలిస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చాలా మందిని భయకంపితులను చేస్తోంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఏంటి? అంతగా భయపడటానికి అందులో ఏముందనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో జీప్ ముందు భాగంలో కూర్చుని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతని పక్క నుంచి ఒక సింహం నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన ఆ వ్యక్తికి ఎం చేయాలో తోచకుండా భయంతో చూడటం చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటికి లక్షల మంది చూసారు, వేలలో లైక్స్ కూడా వచ్చాయి.

వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను అడిగాడు. ఒకటి ఆ స్థానంలో మీరు ఉంటే 'వెంటనే ఆమె ఆలోచిస్తారు', రెండు 'మొదట మీరు ఏం చేస్తారు'. ఈ ప్రశ్నలను నెటిజన్లు తమదైన రీతిలో జవాబులిస్తున్నారు. కొంత మంది నేను అతడి స్థానంలో ఉంటే అమ్మా అని అరుస్తా.. అని, వెంటనే దేవుణ్ణి ప్రార్దిస్తా అని సమాధానాలిస్తున్నారు. ఆ స్థానములో మీరే ఉంటే ఏం చేసేవారో మీ స్టైల్లో చెప్పండి.

(ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement