Anand Mahindra Twitter Video I Don't Think I Would Get a Wink of Sleep - Sakshi
Sakshi News home page

మాల్దీవ్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా! నిద్ర రాదేమో అంటూ..

Published Sun, Aug 13 2023 12:07 PM | Last Updated on Sun, Aug 13 2023 1:55 PM

Anand mahindra twitter video i dont think i would get a wink of sleep - Sakshi

Anand Mahindra Twitter Video: చాలామంది సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లిన కథనాలు గతంలో చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. అండర్ వాటర్ హౌస్‌లో స్టే చేయడం వంటి గొప్ప అనుభూతులు అక్కడ అనుభవించవచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మాల్దీవులకు సంబంధించిన ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేసారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ హోటల్ సూట్‌ను కలిగి ఉన్న ది మురాకా అనే హోటల్ వీడియోను పోస్ట్ చేశారు. అక్కడ ఒక రాత్రి కూడా గడపలేనని, రాత్రంతా గ్లాస్ పగుళ్ళకు వెతుకుతానని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరువేలకు పైగా లైకులు వచ్చాయి, చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం సహజం, కానీ ఆనంద్ మహింద్ర మాత్రం భయపడుతున్నట్లు ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. వీడియోలో మీరు గమనించినట్లతే వాటర్ లోపల ఒక రూమ్ ఉండటం, దాని చుట్టూ.. పైన చేపలు ఈత కొట్టడం వంటివి చూడవచ్చు. ఇది చూడటానికి బాగానే అనిపించినా.. ఎవరికైనా తప్పకుండా భయం పుడుతుంది.

ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్

ఇక్కడ కనిపించే సూట్ 180 డిగ్రీల విశాల దృశ్యాలను చూపిస్తుంది. కావున మీరు ఆ గది లోపల నుంచి బయట తిరిగే జలచరాలను వీక్షించవచ్చు. ఇందులో కావలసిన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రాత్రి ఉండటానికి సుమారు రూ. 41 లక్షలు ఖర్చవుతుందని చెబుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement