Anand Mahindra Twitter Video: భారతదేశంలో పరిచయం అవసరం లేని పేరు 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra). ఈయన ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్త అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ.. ఫాలోవర్ల ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పులి, బాతుని చూడవచ్చు. పులి అక్కడ కనిపించే బాతుని వేటాడాలని నెమ్మదిగా నీటిలోనే ప్రయత్నిస్తోంది. అయితే ఆ సమయంలో బాతు కొంత ముందుకు కదిలి టక్కున నీటిలో మునిగిపోయింది. దెబ్బకు పులి కంగారు పడి చుట్టుపక్కల చూస్తూ ఉండిపోయింది.
(ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!)
Success, and sometimes survival, comes from not making your next move an obvious one…😊 #MondayMotivaton pic.twitter.com/eezOQvMJVS
— anand mahindra (@anandmahindra) July 10, 2023
దీన్ని బట్టి చూస్తే ప్రమాద సమయంలో పక్షి వేసిన ఎత్తుగడ చాలా గొప్పగా అనిపించింది. ఈ వీడియో షేర్ చేస్తూ.. 'విజయం, కొన్నిసార్లు మనుగడ, మీ తదుపరి కదలికను స్పష్టంగా చూపించకపోవడం వల్ల వస్తుంది' అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన స్పందించిన నెటిజన్లలో చాలామంది ఆయన ఆలోచనతో ఏకీభవించారు.
Comments
Please login to add a commentAdd a comment