
'నరేంద్ర మోదీ' భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికలు జరగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయం. తమ ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు భారతీయ ఓటర్లకు అభినందనలు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ జీకి అభినందనలు. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. దేశ ప్రధానికి శుభాకంక్షాలు చెబుతున్నారు.
दुनिया के सबसे बड़े लोकतंत्र में इतिहास के सबसे बड़े चुनाव होना और बिना किसी बाधा के नए सरकार का गठन होना गर्व की बात है।
भारतीय मतदाताओं को अपने महत्वपूर्ण लोकतांत्रिक अधिकार का प्रयोग करने के लिए बधाई।
नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने पर शुभकामनाएं। आशा है कि… pic.twitter.com/t6ylld6FNM— anand mahindra (@anandmahindra) June 9, 2024