
బెంగళూరులోని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు.. ఫుడ్ ఆర్డర్‌లో చేతితో రాసిన నోట్‌ను వేసి, సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం తనను తాను ప్రపోజ్ చేసుకున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇతడు చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు.
డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేతితో రాసిన నోట్‌లో.. తాను మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ కోసం వెతుకుతున్న కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నాడు. నోట్ అందుకున్న వారు తగిన అవకాశం ఉంటే తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా అందులో రాశాడు. ఈ నోట్‌కు సంబంధించిన ఫోటోను.. బెంగళూరులో సొల్యూషన్స్ ఇంజనీర్ నిఖిల్ లింక్డ్ఇన్‌లో షేర్ చేశారు.

జొమాటో డెలివరీ ఏజెంట్ ధైర్యం చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు. డెలివరీలు చేసే హడావిడిలో కూడా తాను.. చేతితో రాసిన నోట్ ద్వారా ఉద్యొగావకాశం కోసం సెర్చ్ చేయడం గొప్ప విషయం అని అన్నారు. డెలివరీ ఏజెంట్ మీద చాలా గౌరవం ఏర్పడిందని మరొకరు కామెంట్ చేయగా. తాను ఆశించినట్లే.. ఇంటర్న్‌షిప్ లభిస్తుందని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయిత