
సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అవే ఫోటోలు. తాజాగా ఆనంద మహీంద్రా జిబ్లీ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై వ్యాపార దిగ్గజం స్పందించారు.
బైకుపై ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నట్టు ఉంది. దీనిపై స్పందిస్తూ.. ఈ జిబ్లీ ఫోటోలను ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ.. ఒక స్మైమ్ ఎమోజీ యాడ్ చేశారు. ఇంజినీర్స్ వ్యూ అనే ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్రా బైకుపై ఉన్నట్లు క్రియేట్ చేసి జిబ్లీ స్టైల్‌లోకి మార్చాడు. ఇప్పుడిది పర్ఫెక్ట్ అంటూ క్యాప్షన్స్ ఇచ్చాడు.
😄
Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv— anand mahindra (@anandmahindra) April 3, 2025
జిబ్లీ స్టూడియో
జిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. చేతితో గీచే యానిమేషన్, బ్యాక్‌గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఇది బాగా పాపులర్ అయింది. కాబట్టి ఈ ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు యూత్ మొత్తం తమ ఫోటోలను జిబ్లీ స్టైల్‌లోకి మార్చుకుని వినియోగించుకుంటున్నారు.
జిబ్లీ వినియోగం ఎక్కువ కావడంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ ట్వీట్ చేశారు.