దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. సిరలను గుర్తించడానికి పరారుణ కాంతిని ఉపయోగించడం చూడవచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సిరలను గుర్తించడం కొంత కష్టమైన పని. ఈ టెక్నాలజీ ద్వారా సిరలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇది వైద్య విధానంలో అతి చిన్న ఆకర్షణీయమైన ఆవిష్కరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేలమంది వీక్షించిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
Using infrared light to locate veins.
Saving the pain from repeated attempts to find a vein when drawing blood.
It’s often the smallest, least glamorous inventions which significantly improve our medical experience and hence, the quality of our lives… pic.twitter.com/XgZI8Bcf2m— anand mahindra (@anandmahindra) July 6, 2024
Comments
Please login to add a commentAdd a comment