Anand Mahindra: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఒక అద్భుతమైన వీడియో తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేవలం ఆనంద్ మహీంద్రాను మాత్రమే కాకుండా వీక్షకులందరిని తప్పకుండా ఆకర్షిస్తుంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక పావురం బ్యాక్‌ఫ్లిప్ చేయడం చూడవచ్చు. ఇది నిజంగా చాలా అందమైన దృశ్యం. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తరువాత దేశం మానసిక స్థితిని తెలిపే వీడియో అంటూ వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియోని వేలమంది వీక్షించారు. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
Was looking for a clip that would encapsulate the mood of the nation after our triumph against Pakistan last night. This was perfect! pic.twitter.com/qVNvVUQVN7
— anand mahindra (@anandmahindra) September 12, 2023
Comments
Please login to add a commentAdd a comment