ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరంగా సంఘటనలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు కూడా అప్పుడప్పుడూ రిప్లై ఇస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వీడియో షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడనేది చూడవచ్చు. జావెలిన్ త్రో అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చే పేరు నీరజ్. ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియా క్రీడాకారుడైన ఇతడు ఒకదాని తర్వాత ఒకటి గోల్డ్ మెడల్ సాధించి భారతదేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు.
ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్!
నీరజ్ చోప్రా పేరు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోందంటే.. అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. కాబట్టి ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే అంటూ మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనికి వేలసంఖ్యలో లైక్స్.. రాగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
He makes winning one Gold medal after the other look easy & effortless, doesn’t he? But think again. Check out the kind of ‘stretching’ he has to for those medals. Nothing EVER comes easily & effortlessly. So start stretching yourself..#MondayMotivation pic.twitter.com/aNypCQuVOn
— anand mahindra (@anandmahindra) October 9, 2023
Comments
Please login to add a commentAdd a comment