పేరులో 'మహీ' ఉన్నందుకు గర్వపడుతున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా? | Anand Mahindra Tweet About Name Of Mahi After MS Dhoni Smashed Hattrick Of Sixes In CSK Vs MI, Tweet Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra: పేరులో 'మహీ' ఉన్నందుకు గర్వపడుతున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?

Published Mon, Apr 15 2024 8:52 PM | Last Updated on Tue, Apr 16 2024 1:26 PM

Anand Mahindra Tweet About Name Of Mahi After MS Dhoni Match - Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇన్నింగ్స్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో MS ధోనీ వరుస సిక్స్‌లతో చెలరేగిపోయారు. ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? నా పేరులో ''మహీ'' ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ.. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పటికే 51వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. లక్షల మంది వీక్షించిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement