పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కొత్త పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. అంతేకాదు స్టార్ క్రికెటర్ ఎంఎస్‌ధోనీపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా. హిల్లేరియస్ ట్వీట్‌తో ట్విటర్‌లో పలు రకాల కామెంట్లతో నవ్వులు పూస్తున్నాయి.
ఐపీఎల్, ప్రో కబడ్డీ తరహాలో ఇండియన్ ఫుడ్ లీగ్ ఉంటే..తాను మాత్రం ఆలూ పరాటా జట్టులో ఆడాలనుకుంటున్నా.. హా.. అన్నట్టు ఖచ్చితంగా ఈ టీంకి ధోనీ కెప్టెన్‌గా ఉండాలి. ఆ ఫుడ్ టీమ్‌లోనే తానూ చేరతాను అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి.
వర్టిగో వారియర్ అనే ట్విటర్ హ్యాండిల్ 18 రకాల మోస్ట్ పాపులర్ వెజిటేరియన్ డిషెస్ ఆఫ్ ఇండియాఅనే పేరుతో కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ఇది చూసి టెంప్ట్ అయిన ఆనంద్‌మహీంద్ర ఇలా సరదాగా కమెంట్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో ఇడ్లీ, ఆలూ పరాఠా, మసాలా దోశ, దాల్ టక్డా, పనీర్ టిక్కా, కిచిడీ, రాజమా చావల్, సమోసా పోహా, చనా మశాలా, పావు బాజీ , ఉప్మా, వడా పావ్, ఛోలే బటూరే, కఛోరీ లాంటి వంటకాలను పోస్ట్ చేసింది. దీనిపై ఆనంద్ మహీంద్ర పేర్కొన్న సరికొత్త ఇండియన్ ఫుడ్ లీగ్ పై తమదైన శైలిలో ట్వీపుల్ స్పందించారు.
If there was an Indian Food League, like the @IPL or @ProKabaddi then I would want to be playing on the Aloo Paratha team….(Of course I would still want to join whichever food team @msdhoni was captain of…😃) https://t.co/GTveHVSqYx
— anand mahindra (@anandmahindra) July 1, 2023
Comments
Please login to add a commentAdd a comment