![Anand Mahindra Share Duck Stand Off With Cows Video - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/21/Anand_mahindra.jpg.webp?itok=iG5YWinV)
హెర్క్యులస్ గున్న ఏనుగు.. తనపై దాడికి యత్నించిన 14 సింహాలతో పోరాడి తప్పించుకున్న కథ బహుశా తెలిసే ఉండొచ్చు. ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తి గురించి చెప్పేందుకు చాలామంది ఈ ఘటనను గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన ఆ రేంజ్ కాకపోయినా.. దాదాపు అంతే ఇన్‌స్పిరేషన్ ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.
సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూలపైనే కాదు.. లైటర్ వే విషయాల్ని పంచుతుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. కొన్నిసార్లు వినోదాన్ని పంచడమే కాదు.. ఆలోచింపజేస్తుంటాయి. అలా ధైర్యం, తెగువకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. సైజు ఏదైతేనేం.. ధైర్యం ఉండాలంటున్నారు ఆయన. ఆ వీడియోకు ఆయనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందంట.
ఒక పక్షి.. చుట్టూ ఆవుల మంద. మధ్యలో ఉంది అది. ఆపై.. చెప్పడం ఎందుకు! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి.
‘How’s the Josh, bird?’ ‘High sir, Ultra high’. That bird’s chutzpah is my #MondayMotivation (courtesy @ErikSolheim ) pic.twitter.com/lVDRXpDZbp
— anand mahindra (@anandmahindra) February 21, 2022
Comments
Please login to add a commentAdd a comment