Motivation
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మీరు గమనించినట్లయితే ఓ మదపుటేనుగు అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఈ సంఘటన చూస్తే ఎవరికైన ఒకింత భయం కలుగుతుంది, కానీ అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు మాత్రం అస్సలు జడుసుకోకుండా దైర్యంగా నిలబడి ఉన్నారు. ఆ ఏనుగు వేగంగా వారి ముందు వచ్చి.. తరువాత వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ప్లే అయ్యే సమయంలో భయానికి రెండర్థాలు ఉన్నాయని.. ఒకటి అన్నీ మర్చిపోయి పరుగెత్తడం.. రెండు అన్నింటిని ఎదుర్కొని నిలబడటం అని కనిపిస్తుంది. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే? వీడియో షేర్ చేస్తూ ఆనంద మహీంద్రా.. మీ భయాన్ని ఎదుర్కోండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటికీ వేలమంది దీనిని లైక్ చేశారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Face your fear. Look at it straight in the eye and it will turn away. #MondayMotivation pic.twitter.com/0RDvH2i9il — anand mahindra (@anandmahindra) January 15, 2024 -
మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని..
'సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే.. సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిముల పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.' ఒంటరితనం వద్దు ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞుల సూచన. సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.. ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిసోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి. విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు.. వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. మంచి జరగబోతోందని ఊహించుకోవాలి. ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు వద్దు నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో.. ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఇవి చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది! -
రూపం లేని ఇంధనం ఆశ
ఆశ మనిషిని కదిలించి నడిపించే రూపంలేని ఇంధనం; ఆశ మనిషిని ఎప్పటికప్పుడు బతికిస్తూ ఉండే ఆకృతి లేని మూలకం. ఆశలేకపోతే మనిషికి మనుగడే ఉండదు. మనుగడకు మనుగడ ఉండాలంటే మనిషికి ఆశ ఉండాలి. మనిషి పొందుతున్న ప్రతిదానికీ ఆశపడడమే కీలకం. మనిషి గమ్యానికీ ఆశ ఆరంభం. మనిషికి ఆశ అంతం అవడం ఉండకూడదు. ఆశ అన్నది అంతం అవడం అంటే మనిషి అంతం అవడం తప్పితే మరొకటి కాకూడదు. మనిషి క్రియాశీలకం అవడానికి ఆశే ప్రేరణ. ఆశవల్లే మొత్తం ప్రపంచం క్రియాశీలకం ఔతోంది. ‘ఆశ అనేది మనుషులకు ఉన్న శృంఖలాల్లో అత్యంత ఆశ్చర్యకరమైంది. దానికి బద్ధులైనవాళ్లు పరుగులు పెడతూ ఉంటారు; ఆ శృంఖలాల నుంచి విముక్తులైనవాళ్లు చతికిలబడిపోతూ ఉంటారు’ అని హితోపదేశం తెలియజెబుతోంది. ఆశ ఉన్న మనిషి పరుగెడుతూ ఉంటాడు; ఆశలేని మనిషి చతికిలబడిపోతాడు; చచ్చుబడిపోతాడు. ఆశను కలిగించే మాటలు నీకు శక్తిని ఇస్తాయి‘ అని జపనీస్ కవి–బౌద్ధతాత్త్వికుడు దైసకు ఇకెద ఒక కవితలో అంటారు. ఈ దైసకు ఇకేదకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్టరేట్స్ వచ్చాయి! 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి ఆయన మినహా కుటుంబం మొత్తం బలి అయిపోయింది. అ పరిస్థితి నుంచి ఆయన ఆశతో, ఆశ ఇచ్చిన శక్తితో విశ్వ – విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్ట రేట్స్ అందుకున్న మహోన్నతుడిగా ఎదిగారు. శక్తై, మహాశక్తై ఆశ మనిషిని ముందుకు, మునుముందుకు నడిపిస్తూ ఉంటుంది; మహోన్నతుణ్ణి చేస్తూ ఉంటుంది. ఆశ వేరు దురాశ వేరు. మనిషికి ఆశపడడంపై అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి ఐనా తనను తాను చూసుకోకుండా లేదా తనను తాను తెలుసుకోకుండా ఆశపడుతూ ఉండడం తప్పు. ఆశ అనేదే లేకపోతే మనుగడ జరగదు. కానీ దురాశవల్ల మనుగడ తిన్నగా ఉండదు, సాగదు. ఆశ వికటిస్తే దురాశ ఔతుంది; వికృతమైన మనస్తత్వానికి దురాశ ఒక అభివ్యక్తి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న హిట్లర్ దురాశ పెనువినాశనానికి కారణమై చివరికి అతడి అంతానికీ కారణం ఐంది. నెపోలియన్ కూడా ప్రపంచాన్ని జయించేయాలన్న దురాశతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి చివరికి బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కి చెరసాలపాలై ఆపై అనాథై మరణించాడు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అని ఎప్పుడో చెప్పబడ్డ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సరైందే; ఎప్పటికప్పుడు అది మనకు దిశానిర్దేశం చేసేదే. మనం ఎప్పుడూ దురాశకు అతీతంగానే ఉండాలి. ఆశ ఫలించని వేళల్లో మనిషిని నిరాశ చుట్టుకుంటుంది. నిరాశకు లోనుకాని మనిషి ఉండడం ఉండదు. నిరాశకు బలి ఐపోయినవాళ్లూ ఉన్నారు. నిరాశ అనే వ్రణం ఎవరినైనా సలుపుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆ నిరాశకు చిత్తైపోకుండా ఉండాలంటే, నిరాశపై విజయం సాధించి రాణించాలంటే మనిషికి ఉండాల్సింది ఆశే. ఆశతోనే మనిషి నిరాశపై నెగ్గాలి. పుట్టిన ప్రతివ్యక్తికి పాలు తాగడం నుంచీ ఆశ మొదలు ఔతుంది. నిజానికి వ్యక్తికి పాలు తాగడంకన్నా ముందే ఆశ మొదలు ఔతుంది; ఆ ఆశవల్లే పాలుతాగడం మొదలు ఔతుంది; ఆశ మొదలుకాగా మనిషికి మనుగడ మొదలు ఔతుంది. మనిషి పోయేంత వరకూ మనిషిని వీడిపోకుండా ఉండాల్సింది ఆశ. వర్తమానం భవిష్యత్తును ఆవాహన చెయ్యాలంటే మనకు కావాల్సినవి ఆశ ఆపై సదాశ. ఆశ, సదాశలతో మనం అభ్యున్నతిని పొందాలి. ఆశ ప్రగతికి మూలం; దురాశ పతనానికి మూలం. ఈ విషయాన్ని మనిషి అవగతం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి; తన ఆశకు తగినట్టు మనిషి తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఆశ, సదాశల్ని ప్రయుక్తం చేసుకుని ప్రతిమనిషీ ప్రశస్తం అవాలి. – రోచిష్మాన్ -
టెన్త్ ఫెయిల్ అయ్యారని బాధపడొద్దు..ఈ వీడియో చుడండి
-
టెన్నిస్ స్టార్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్: ఎలా మొదలు పెట్టిందో అలానే..
సాక్షి,ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , ఎం అండ్ ఎం ఆనంద్ మహీంద్ర ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోలోయర్లకు ప్రేరణగా నిలుస్తుంటారు. స్ఫూర్తిదాయక కంటెంట్‌ను పంచు కుంటారు. అలాగే వినూత్న ఆవిష్కరణలు, జీవిత సలహాలు, ఒక్కోసారి ఫన్నీ వీడియోలు పంచుకుంటూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా ట్విటర్లో ఒక సీక్రెట్‌ను రివీల్ చేశారు. టెన్నిస్ సంచలన సానియా మీర్జా తనకు స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్‌మహీంద్ర మండే మోటివేషన్: గెలవాలనే ఆకలి ఏ దశలోనూ చచ్చిపోకూడదు! మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన "మండే మోటివషన్"ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్ఫూర్తిదాయక పోస్ట్ షేర్ చేశారు. విజయం సాధించాలనే ఆకలితో ఆటను ఎలా ప్రారంభించిందో అదే ఉత్సాహంతో తన కరియర్ని ముగించిందంటూ కితాబిచ్చారు. అంతేకాదు తాను కూడా తన కెరీర్లో ఈ దశలోనైనా రాణించాలనే కోరికను సజీవంగా ఉంచుకోవాలనే విషయాన్ని గుర్తు చేసిందని మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా "పోటీ నా రక్తంలో ఉంది.. కోర్టులో అడుగుపెట్టిన ప్రతిసారీ నేను గెలవాలనే కోరుకుంటా.. అది చివరి గేమా లేక చివరి సీజనా అనే దానితో సంబంధం లేకుండా విజయాన్నే కోరుకుంటా’ అనే కోట్ ఉన్న సానియా ఫోటోను కూడా షేర్ చేయడం విశేషం.దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. లక్షా 40వేలకు పైగా వ్యూస్‌ని, రెండువేలకు పైగా లైక్‌లను పొందింది. చాలామంది ఆనంద్ మహీంద్ర అభిప్రాయంతో ఏకీభవించారు, "అద్భుతమైన క్రీడాకారిణి" అంటూ సానియాను అభివర్ణించారు. కాగా తన సుదీర్ఘ కరియర్లో అనేక టైటిల్స్‌ని, గ్రాండ్‌స్లాం ట్రోఫీలను గెల్చుకున్న సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. She ended her playing career the way she started it: with her hunger to succeed undiminished. Reminds me to keep the desire to excel alive, even at this stage in my career. She’s my #MondayMotivation pic.twitter.com/6GnQYieBEe — anand mahindra (@anandmahindra) February 6, 2023 -
అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా 'మండే మోటివేషన్' కోట్స్, వీడియోలను ట్విటర్లో షేర్ చేయడం అలవాటు. తాజాగా మండే బ్లూస్ అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కోట్‌ను ట్వీట్ చేశారు. "మనందరికీ పిచ్చి అని గ్రహించిన క్షణంలో మాత్రమే జీవితం పూర్తిగా అర్థమవుతుంది." అనే కోట్‌ను అభిమానులతో షేర్ చేశారు. ప్రపంచమే ఒక పచ్చి వలయం. అందులో మనం కూడా కొంచెం వెర్రి వాళ్లమనే సత్యాన్ని గ్రహించగలిగితే చక్కని చిరునవ్వుతో సోమవారం పనిలోకి దిగుతాం. మీరు చేసే పనిలో 'క్రేజీ గుడ్'గా ఉండటానికి ప్రయత్నించండి అంటూ సూచించారు. దీంతోపాటు ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్ కూడా ఆలోచనాత్మంగా మారింది. “నర్సింగ్ హోమ్ ఇన్ ఏ పోస్ట్ టెక్ట్సింగ్ వరల్డ్” అనే టైటిల్‌తో ఉన్న ఒక కార్టూన్‌ను షేర్ చేశారు. వేలం వెర్రిగా పెరిగి పోతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంపై బాధాకరమైన కార్టూన్‌ను ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్టూన్ చూస్తేనే భయంగా ఉందనీ, తనను ఇది ఫోన్ పక్కన పెట్టేలా చేసిందన్నారు. “ తీవ్రంగా బాధ కలిగించే కార్టూన్ ఇది. నా ఫోన్‌ను పక్కన పెట్టేలా చేసింది (ఈ ట్వీట్ చేసిన తర్వాత!). మెడను నిటారుగా ఉంచుకొని, తల ఎత్తుకొని నా ఆదివారాన్ని గడిపేలా చేసింది” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కాగా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పొద్దున్న లేచింది మొదలు, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. అలా విచక్షణ లేకుండా నిరంతరం మొబైల్‌ను చెక్ చేస్తూ, దానికి బానిసలై పోతున్న వారి పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఈ కార్టూన్. రోగులుగా మనం నర్సింగ్ హోంలో ఎలా ఉండబోతున్నామో అనడానికి పూర్తి నిదర్శనంగా నిలుస్తోంది ఈ కార్టూన్. You may be able to go in to work on Mondays with a smile on your face if you acknowledge inside yourself that the world’s a madhouse & we’re all a bit crazy. Just make sure you try to be ‘crazy good’ at what you do…! pic.twitter.com/kyw8YRLzxH — anand mahindra (@anandmahindra) November 28, 2022 That’s a seriously depressing cartoon. But it’s made me decide to put down the phone (after tweeting this!) and ensure that my Sunday is spent with my neck straight and my head up… pic.twitter.com/seEdiAhQAC — anand mahindra (@anandmahindra) November 27, 2022 -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
శుభ్ మన్ గిల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్
-
ఈ ధైర్యమే నాకు ప్రేరణ: ఆనంద్ మహీంద్రా
హెర్క్యులస్ గున్న ఏనుగు.. తనపై దాడికి యత్నించిన 14 సింహాలతో పోరాడి తప్పించుకున్న కథ బహుశా తెలిసే ఉండొచ్చు. ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తి గురించి చెప్పేందుకు చాలామంది ఈ ఘటనను గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన ఆ రేంజ్ కాకపోయినా.. దాదాపు అంతే ఇన్స్పిరేషన్ ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూలపైనే కాదు.. లైటర్ వే విషయాల్ని పంచుతుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. కొన్నిసార్లు వినోదాన్ని పంచడమే కాదు.. ఆలోచింపజేస్తుంటాయి. అలా ధైర్యం, తెగువకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. సైజు ఏదైతేనేం.. ధైర్యం ఉండాలంటున్నారు ఆయన. ఆ వీడియోకు ఆయనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందంట. ఒక పక్షి.. చుట్టూ ఆవుల మంద. మధ్యలో ఉంది అది. ఆపై.. చెప్పడం ఎందుకు! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి. ‘How’s the Josh, bird?’ ‘High sir, Ultra high’. That bird’s chutzpah is my #MondayMotivation (courtesy @ErikSolheim ) pic.twitter.com/lVDRXpDZbp — anand mahindra (@anandmahindra) February 21, 2022 -
ఏం చేయగలను.. వారిని ఇంతవరకూ చూడలేదు: సమంత
Samantha Said What Would I Do In Her Latest Post: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు విడాకలు తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అలాగే కొంచే ఖాళీ సమయం దొరికినా స్నేహితులతో షికార్లు చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువ సమయం ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఇష్టపడుతోంది సామ్. తాజాగా తన స్నేహితులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. సమంత స్నేహితులు రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్లతో కలిసి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఈ ఫొటోలో ముగ్గురూ రిక్లైనర్ సోఫాలో పడుకుని ఉండగా రాహుల్ సెల్ఫీ తీశాడు. ఈ ఫొటో స్టోరీలో షేర్ చేస్తూ 'మీరు లేకుండా నేను ఏం చేయగలను' అని రాసుకొచ్చింది సామ్. సమంత ఇలా కోట్ చేస్తూ రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌ను ట్యాగ్ చేసింది. సమంత అతి సన్నిహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ అనే సంగతి తెలిసిందే. తర్వాత 'సులభతరమైన గతం లేని దృఢమైన వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు' అని మరొక స్టోరీ షేర్ చేసింది సామ్. ఇదిలా ఉంటే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశకి చేరింది. తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతున్న 'యశోద' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తికాగా హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కాతువాకుల రెండు కాదల్, తదిదర బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బీజీగా ఉంది సామ్. ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్ -
2022లో ఇలా ప్రయత్నించండి.. జీవితం అందమైనదే!
‘ప్రతి ఒక్కరూ తమను తాము స్వీకరించాలి. తమను తాము ప్రేమించుకోవాలి. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగిపోవాలి. ఆకాశంలో ఎగరాలని ఉంటే ఆ కోరిక తప్పేమీ కాదు. అయితే... పైకి ఎగరడానికి అడ్డు వస్తున్న బరువులను పక్కన పెట్టాలి. పక్కన పెట్టాల్సింది బరువులను మాత్రమే, బాధ్యతలను కాదు. అప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ, మన హక్కులను మనం గౌరవించుకుంటూ, ఇతరుల హక్కులకు భంగానికి కారణం కాకుండా, వివాదరహితంగా జీవించడం ఎలాగో తెలియకపోవడం వల్లనే జీవితం కష్టాలపాలవుతుంటుంది. మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులను అగౌరవపరచకుండా ఉండగలిగే స్థితప్రజ్ఞత కలుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులకు ఆత్మీయతను పంచడమూ వస్తుంది. మన దారిలో అడ్డుగా ఉన్న ముళ్లను తీసి పారేసుకునే క్రమంలో ఆ ముళ్లను పక్కవారి దారిలో వేయకుండా ఉండగలిగితే మన జీవితం హాయిగా సాగిపోతుంది. ఆశలకు ఆకాశమే హద్దుగా ఉండవచ్చు, పక్షిని చూసి స్ఫూర్తి పొందనూ వచ్చు, పక్షిలాగ తేలిగ్గా ఉండాలి. ఇక్కడ తేలిగ్గా ఉండాల్సింది దేహం కాదు, మనసు. అనవసర ఆందోళనలు, ఆలోచనలకు తావివ్వకుండా మనసును తేలిగ్గా ఉంచుకోగలిగితే ఆశలకు, ఆకాంక్షలకు ఏదీ అడ్డురాదు. మన కంటికి పక్షి స్వేచ్ఛగా విహరించడమే కనిపిస్తుంది. కానీ అది అలా విహరించి ఆహారాన్ని అన్వేషించి గూటిలో ఉన్న రెక్కలు రాని పిల్లలను పోషించే గురుతర బాధ్యతను తన రెక్కల్లో ఇముడ్చుకుని ఉంటుంది. మన కంటికి కనిపించేది స్వేచ్ఛా విహంగమే. ఆ స్వేచ్ఛతోపాటు రెక్కల మాటున దాగి ఉన్న బాధ్యత నుంచి కూడా మనం స్ఫూర్తి పొందాలి. పక్షి గూటిలో ఉన్న పిల్లలను కాళ్లకు బంధనాలుగా కట్టుకుని ఆకాశంలోకి వెళ్లదు, అలాగని పిల్లల బాధ్యతను వదిలి ఆకాశంలో విహరించదు. మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియని అనిశ్చితిలో కూడా తన లక్ష్యాన్ని మరువదు. బాధ్యతను బరువుగా భావించదు. ఈ సూత్రం ఆధారంగా జీవితాన్ని అల్లుకుంటే జీవితం అందరికీ అందమైనదే అయి తీరుతుంది. ఈ ఏడాదిలో ఇలాగ ప్రయత్నించి చూద్దాం. -
పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి
సాక్షి,అర్వపల్లి(నల్గొండ): ఆ యువకుడికి పుట్టుకతోనే మూగ , చెవుడు.. దీనికి తోడు పోలియోతో రెండు కాళ్లు వంకర్లు తిరిగి పనిచేయవు. అయితేనేం ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పని అయినా చేయవచ్చని నిరూపిస్తున్నాడు. జాజిరెడ్డిగూడేనికి చెందిన సయ్యద్ హైదర్ అలీ కుమారుడు వాహిద్ అలీ. కుటుంబ పరిస్థితుల కారణంగా పదోతరగతితో చదువు మానేశాడు. తండ్రి వద్ద ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు తదితర వాహనాల టైర్లు పంక్చర్లు చేయడం నేర్చుకుని నాలుగేళ్లుగా పనిచేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. రుణం మంజూరు చేస్తే దుకాణాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెబుతున్నాడు. మరో ఘటనలో.. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం నార్కట్‌పల్లి: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయం పంటలు సాగుచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతులను తికమక పెడుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి వానాకాలం ఎంత ధాన్యం కొంటారో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కోండురు శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి.. -
వైరలవుతున్న హర్ష్ గోయెంకా ట్వీట్
ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ ద్వారా జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూచనలు చేశారు. యుక్త వయసులో ఉన్నవారు తాను చెప్పే ఆరు సూత్రాలు పాటిస్తే జీవితంలో ఉన్నతస్థానంలో ఉంటారని గోయెంకా పేర్కొన్నారు. ఆ ఆరు సూత్రాలు ఏంటంటే.. 'అప్పులకు దూరంగా ఉండండి... పేరు ప్రఖ్యాతలను సంపాధించగల నైపుణ్యాలను తెలుసుకోండి... సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించుకోండి.... టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ప్రయత్నించండి.. ఇతరుల అభిప్రాయాల గురించి బాధపడకండి... విషయాల కంటే నేర్చుకోవడం లేదా అనుభవాల మీద దృష్టి పెట్టండి' అంటూ ఆరు సూత్రాలను చెప్పుకొచ్చారు. హర్ష్ గొయొంకా చేసిన కామెంట్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచించేలా విధంగా ఉన్నాయి. గొయొంకా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారి వేలల్లో లైక్స్ వచ్చాయి. నెటిజన్లు స్పందిస్తూ... మీరు చెప్పినవన్నీ నిజాలే సార్.. కానీ యుక్త వయసుకు పరిమితి ఎంత అనేది స్పష్టం చేయండి.. ఇలాంటివి ఈరోజుల్లో ఎంతో అవసరం.. మీరు చెప్పనవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
‘యూవీ బ్యాటింగ్ అందరికి చూడాలనుంది’
న్యూఢిల్లీ: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రీంట్రీ కోసం ఆసక్తి చూపడంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. గౌతం గంభీర్ శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ యువరాజ్ సింగ్ పంజాబ్ క్రికెట్లో డొమస్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. అయితే యూవీ తిరిగి క్రికెట్ ఆడడం రావడం అతని వ్యక్తిగతమని, కానీ యూవీ ఫ్యాన్స్‌కు, క్రికెట్ అభిమానులకు చాలా సంతోషిస్తారని తెలిపారు. కాగా గంభీర్, యువరాజ్ ఆటగాళ్లుగా ఉన్న సమయంలో టీ 20 ప్రపంచ కప్(2007), వన్డే ప్రపంచ కప్(2011) గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో క్రికెట్ పట్ల ఆసక్త ఉన్న యువత మాత్రం యువరాజ్ తిరిగి క్రికెట్‌కు రీఎంట్రీ ఇచ్చి తమకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నారు. -
‘సచిన్ ప్రేరణ కలిగించలేదు’
న్యూడిల్లీ: భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యాల పట్ల సంతృప్తికరంగా లేనని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ తెలిపారు. శశిథరూర్ మాట్లాడుతూ టీమ్‌లో ఆటగాడుగా ఉన్న సమయంలో సచిన్ ఫీల్డ్‌లో సహచరులకు ఇచ్చే సలహాలను చూసి అతను గొప్ప కెప్టెన్ అవుతాడని భావించే వాడినని తెలిపాడు. కాగా 1996 సంవత్సరంలో టెండూల్కర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 73 వన్డే మ్యాచ్‌లకు టెండూల్కర్ సారథ్యం(కెప్టెన్) వహించగా కేవలం 23మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 43మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. కాగా సచిన్ కాప్టెన్‌గా ఉన్న సమయంలో జుట్టు పటిష్టంగా లేదని, ఆ టైమ్‌లో ఆటగాళ్లకు ప్రేరణ కలిగించలేకపోయానని సచిన్ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు కెప్టెన్‌గా సరైన విజయాలు రాకపోవడంతో స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి సచిన్ తప్పుకున్నాడు. కొద్ది కాలానికి తిరిగి కెప్టెన్సీని తీసుకోమని మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చినా సచిన్ సున్నితంగా తిరస్కరించాడని శశిథరూర్ పేర్కొన్నాడు. (చదవండి: ధోని, సచిన్‌లు నన్ను నిరాశపరిచారు: శశిథరూర్) -
ధోని, ఇన్ఫోసిస్ ఒకే సంవత్సరంలో..
ముంబై: దేశ చరిత్రలో 1981సంవత్సరం ఎంతో చరిత్రాత్మకమైనది. ఒకరు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజయితే, మరొకటి ఐటీ రంగంలో ప్రపంచానికే ప్రేరణగా నిలిచిన దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసీస్ స్థాపించిన రోజు(1981) కావడం విశేషం. మరోవైపు జులై 7, 1981సంవత్సరంలో రాంచీలో ధోని జన్నిస్తే, అదే రోజు పుణెలో ఇన్పోసీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 2లక్షల 39వేల మంది ఉద్యోగులతో ఎన్వైఎస్ఈ గ్లోబల్ కంపెనీ లిస్టింగ్‌లో రికార్డు సృష్టించింది. అదే విధంగా చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రతిభ, సహనంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్‌గా ధోని ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అయితే ధోని, ఇన్ఫోసిస్ ప్రేరణతో అత్యుత్తమ క్రీడాకారులు, ఐటీ దిగ్గజ కంపెనీలు మరెన్నో నెలకొల్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చదవండి: ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్ -
‘సుశాంత్‌కు చాక్లెట్లు, గులాబ్ జామ్లంటే ఇష్టం’
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపుతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్పందించారు. సుశాంత్‌ని మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తిగా ప్రేక్షకులు గుర్తించుకోవద్దని, దేశంలోనే అనేక మందికి ఆయన ప్రేరణ కలిగించారని అంకిత గుర్తు చేశారు. ప్రేక్షకులు ఆయనను ప్రేరణ కలిగించే వ్యక్తిగా గుర్తుంచుకోవాలని సూచించారు. సుశాంత్‌తో ఉన్న సాన్నిహిత్యంపై స్పందిస్తూ.. తనకు నటన నేర్పిన గొప్ప వ్యక్తి అని పేర్కొంది. కానీ మీడియాలో సుశాంత్‌పై సొంతంగా కథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సుశాంత్‌ది చిన్న పిల్లల మనస్థత్వమని, చిన్న విషయాలను సైతం సుశాంత్ ఆస్వాధించేవాడని తెలిపింది. ఆయనకు చాక్లెట్లు, గులాబ్ జామ్లంటే చాలా ఇష్టమని పేర్కొంది. అంకిత బుల్లితెర నటిగా, హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు. -
మెరుగైన ఫలితాల కోసం కష్టపడాలి: కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి యువతకు ప్రేరణ కలిగించే అంశాలను సోషల్ మీడియాలో తరుచుగా పోస్ట్ చేస్తుంటాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లలో అద్భుత ఫోమ్‌ను కొనసాగిస్తున్న విరాట్ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేశాడు. ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్న దృష్యాలను ఫోస్ట్ చేశాడు. ఏ పని చేసినా ఏదో కష్టపడాలని కాకుండా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లిని ఆదర్శంగా తీసుకొని మహ్మద్ షమీ ఫిట్నెస్ సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తుంది. View this post on Instagram Putting in the work shouldn't be a choice, it should be a requirement to get better. #keeppushingyourself A post shared by Virat Kohli (@virat.kohli) on Jan 27, 2020 at 3:35pm PST ఈ మధ్య కాలంలో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ఫిట్నెస్ను సాధించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందిస్తూ..ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగు పరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆటగాళ్లు సిక్సులను సులభంగా బాదుతున్నారని కొనియాడారు. చదవండి: కోహ్లికి నాకు కొన్ని పోలికలు నిజమే: బాలీవుడ్ నటి -
పాక్ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్ అడ్వైజ్ ఇదే!
సాక్షి: క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ ప్రతిభతో జట్టును ముందుండి విజయతీరాలకు నడిపిస్తాడని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ఫోకస్ చేయాలని జట్టు సభ్యులకు ఆయన సూచించారు. పాక్ సారథిగా 1992 ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌ఖాన్ తన వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘నా కెరీర్ ప్రారంభంలో 70శాతం ప్రతిభ, 30శాతం మానసిక బలంతో నేను విజయం సాధించానని భావించాను. కానీ కెరీర్ పూర్తయిన తరువాత ఇది 50-50 శాతం అనుకున్నాను. కానీ, 60శాతం మానసిక బలం, 40శాతం ప్రతిభతో రాణించినట్టు నా మిత్రుడు గవాస్కర్ చెప్పాడు. దానితో నేను ఏకీభవిస్తాను’ అని పేర్కొన్నారు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్ ఆడతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. -
ఇలా చేస్తే మీ బిడియం పోతుంది..
విశాఖ సిటీ: కొందరికి పదిమందిలో మాట్లాడాలంటే భయం వెంటాడుతుంది. వారి అర చేతులు చెమటలతో తడిసిపోతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినా, వేదిక పైకెక్కి మాట్లాడాలన్నా వారిలో ఎక్కడి లేని ఆందోళన. ఈ బిడియం వల్లనే చాలా మంది యువత ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక ఉద్యోగాల వేటలో విఫలమైపోతున్నారు. అలాంటి వారిలో ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టేందుకు బుక్ హాలిక్ సంస్థ బ్లైండ్ ఫోల్డ్ మీట్ ఏర్పాటు చేసింది. బిడియస్తులకు వినూత్న వేదిక ప్రతి వారిలోనూ కాస్తో కూస్తో భయం ఉంటుంది. అయితే కొందరిలో ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా పది మందిలో మాట్లాడాలన్నా, వారికి ఎక్కడా లేని బిడియం ఆవహిస్తుంది. ఈ కారణంగా చాలా మంది భవిష్యత్‌ని కోల్పోతున్నారు. పది మందిలో మాట్లాడకపోవడమంటే మన ఆత్మ విశ్వాసాన్ని క్షీణించుకునేలా చేసుకోవడమే అంటున్నారు బుక్‌హాలిక్ ప్రతినిధులు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మాట్లాడండి.. వేదికపై నిలబడి పదిమందితో మీ అనుభవాలు పంచుకోండి.. ఎందుకంటే ప్రయత్నం చేస్తే భయం పోతుంది. భయాన్ని వేరు చేసి దాన్ని పోగొట్టుకునేందుకు మేము వేదిక కల్పిస్తామంటూ వినూత్న పద్ధతిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యువకులు. దానిపేరే బ్లైండ్ ఫోల్డ్ మీట్ అప్. చూసీ చూడనట్లుగానే స్టేజ్ ఫియర్ వల్ల చాలా మంది అవకాశం వచ్చినా గొంతు పెగల్లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. ఎదురుగా జనాన్ని చూస్తే ఒక్క పదం కూడా బయటికి చెప్పేందుకు భయపడుతుంటారు. అలాంటి వారిలో భయం పోగొట్టేందుకు పుస్తకమే ఆయుధంగా బుక్‌హాలిక్ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు కార్యక్రమం నిర్వహించారు. జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకం గురించి చెబుతూనే.. జీవితంలో ఎదురైన అనుభవాల్ని వివరించాలి. స్టేజ్ ఫియర్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. వారు మొదటిసారిగా స్టేజ్‌పై భయ పడతారనే ఉద్దేశంతో వారిని అలవాటు చేసేందుకు కళ్లకు గంతలు కట్టి మాట్లాడించడమే ఈ మీట్ కార్యక్రమం. ప్రస్తుతం పరిగెత్తే ప్రపంచంలో ఏ ఒక్క విషయంలోనైనా వెనకడుగు వేస్తే ఇక రేసులో ముందుకు వెళ్లడం కష్టమని హెచ్చరిస్తూ.. బిడియాన్ని బయటకు పంపించేలా చేస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెంలో నిర్వహించిన ఈ మీట్లో సుమారు 30 మంది పాల్గొన్నారు. ముందు కళ్లకు గంతలు లేకుండా స్టేజ్‌పైకి తీసుకెళ్లారు. చుట్టూ ఉన్న యువతను చూసి భయపడిన వారు.. గంతలు కట్టాక అనర్గళంగా వేదికపై నిలబడే మాట్లాడుతూ అందరి ప్రశంసలూ అందుకున్నారు. అలా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా మొదటిసారి ప్రసంగించడంతో వారిలోనూ కొత్త ఉత్సాహం ఉరకలేసింది. ఒక మంచి పుస్తకం మన విజ్ఞాన వికాసానికి సహాయపడుతుంది... పుస్తకమంటే అక్షరాలున్న పేజీలు కాదు.. పుస్తకమంటే జీవితం.. ఓ అనుభవం కాబట్టి.. ఈ బ్లైండ్ ఫోల్డ్ మీట్లో పుస్తకం గురించి ప్రసంగంతో ప్రారంభించామని బుక్‌హాలిక్ ప్రతినిధులు సంవేద్ తదితరులు తెలిపారు. సరికొత్త ఆలోచన అమలు చేస్తే ఏ రంగంలోనైనా విజయం వరిస్తుందని తెలుసుకున్నామనీ, ఈ మీట్‌తో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నామని కార్యక్రమంలో పాల్గొన్న యువత అభిప్రాయం వ్యక్తం చేశారు. -
స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన జీవిత సత్యాలు..
స్టీఫెన్ హాకింగ్స్ భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆయన తన మనుసుతో పలికిన ప్రతిభావం చిరస్మరణీయం. ఆయన పుస్తకం మనకు మార్గదర్శకం. హాకింగ్స్ తన జీవితంలో కేవలం సృష్టిని వివరించడమే కాదు మనిషి ఎలా ఉండాలి, మనసును ఎలా ఉంచుకోవాలి అన్న విషయాలను భావి తరాలకు అందించారు. ఆయన చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ప్రతి మనిషికి వర్తించడమే కాదు ఎలా ప్రవర్తించాలో చెబుతాయి. ‘‘పని మీ జీవితానికో అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది..అది లేకుండా మీ జీవితం శూన్యం’’ ఇది 2010 సంవత్సరంలో ఏబీసీ వరల్డ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట. ఈ వ్యాఖ్య గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ సాలీ మైట్లిస్ వివరిస్తూ.. ‘‘ఈ వ్యాఖ్య ప్రతి జీవితానికీ వర్తిస్తుంది. పని కేవలం మన కడుపునింపే ఓ అవసరం మాత్రమే కాదు మన ఆత్మ సంతృప్తినిచ్చే చక్కటి ఔషధం కూడా. మనం చేసే పనిని ప్రేమిస్తే ఆ పని ఎంత కష్టమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అందులో నీకు నువ్వు చేయాల్సిన పని తప్ప కష్టం కనిపించదు. ఇది నీకు మాత్రమే కాదు నువ్వు పని చేసే సంస్థ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది.’’ అంటారామె. ‘మీరు కెరీర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ జీవితంలో కచ్చితంగా సానుకూల ప్రభావాలను కలిగి ఉంటారు.’ ఈ విషయాన్ని చాలా మంది గొప్పవాళ్లు, తత్వ శాస్త్ర నిపుణులు అంగీకరించారు. మన జీవితంలో ఒక వృత్తిని ఎంచుకోవడం ద్వారా సగం విజయం సాధించినట్టేనని వారు తెలిపారు. అది మన జీవితంలో చోటుచేసుకోబోయే మంచి పరిణామాలకు మార్గమన్నారు. -
అమ్మానాన్నలే ‘ప్రేరణ’
వారి స్ఫూర్తితోనే ఐఏఎస్ సాధించా.. ఎంత బిజీగా ఉన్నా పాపతో రిలాక్స్ మంచి స్నేహం లక్ష్య సాధనకు దోహదం ఇప్పటికీ స్నేహితులతో టచ్‌లో ఉంటా... క్రికెట్ ఇష్టం.. చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ కర్రీ మహా ప్రీతి రాజీవ్‌గాంధీ హన్మంతు, ఐటీడీఏ పీఓ భద్రాచలం : గ్రామీణ నేపథ్యం.. సాధారణ మధ్య తరగతి కుటుంబం.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య.. కానీ లక్ష్యం మహోన్నతం. ఐఏఎస్ సాధించాలనుకున్నారు.. ఆకాంక్ష నెరవేర్చుకున్నారు.. ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు. ప్రభుత్వోద్యోగులైన తల్లిదండ్రుల స్ఫూర్తితో.. కలెక్టర్ ఉద్యోగం గురించి.. వారి మాటల స్ఫూర్తితో అనుకున్న లక్ష్యం సాధించారు. ఎంత ఒత్తిడి ఉన్నా తన కూతురు ప్రేరణతో గడిపితే ఇట్టే రిలాక్స్ అవుతానని.. ఇప్పటికీ స్నేహితులతో టచ్‌లో ఉంటానని..క్రికెట్ అంటే ఇష్టమని.. చికెన్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ బాగా తింటానని.. ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలే నేటి సండే స్పెషల్... ఐఏఎస్ కావాలనే ఆలోచన.. అమ్మానాన్నలు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు కావడంతో తరచూ అధికారుల పనితీరు గురించి మాట్లాడుకునే వారు. ఆ మాటల్లో జిల్లా కలెక్టర్ గురించి ఓ రోజు ప్రస్తావించారు. అవే నాకు ప్రేరణను ఇచ్చాయి. ఆ రోజే అనుకున్న నేను ఏనాటికైనా కలెక్టర్ స్థాయి ఉద్యోగం పొందాలని. పట్టుదలతో సాధించాను.. అమ్మానాన్న ఎంతో ఆనందించారు. కుటుంబం గురించి.. నా భార్య విజయలక్ష్మి ఎల్ఎల్బీ చదివింది. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుంది. హరితహారం పథకంలో భాగంగా ఐటీడీఏ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటింది. ఇకపోతే మా అమ్మాయి ప్రేరణ అంటే నాకెంతో ఇష్టం. ఎంత అలసటతో ఇంటికెళ్లినా మా పాపతో గడిపితే ఎంతో రిలాక్స్. వెల్ఫేర్ ఆఫీసర్‌గా నాన్న ఎక్కువ సమయం హాస్టల్లోనే ఉండేవారు. నాలుగైదు రోజులకోసారి ఇంటికి వచ్చేవారు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు మాత్రం నాతో ఎక్కువ గడిపేవారు. నాన్నతో కబుర్లు చెప్పాలనే కోరిక ఉండేది. ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. అటువంటి వెలితి నా కుమార్తెకు రావద్దని ఎక్కువ సమయం ఆమెతో గడుపుతాను. ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి. చిన్నప్పుడు.. చదువుకునే రోజుల్లో క్రికెట్ బాగా ఆడేవాళ్లం. ఇంటర్మీడియెట్ రెసిడెన్షియల్ కావడంతో ఆటలకు బ్రేక్ పడింది. కానీ బీటెక్‌లో మళ్లీ స్నేహితులతో కలిసి క్రికెట్ ఇరగదీసేవాణ్ని. మంచి స్నేహితులు లక్ష్యానికి దోహదపడతారు. కాలేజీ నాటి స్నేహితులతో ఇప్పటికీ టచ్‌లో ఉంటాను. ఐఏఎస్ అధికారిగా.. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాను. ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో ఎన్నో ఏళ్లు అది ముందుకు సాగలేదు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో రైతులతో నేరుగా మాట్లాడాను. నా హయాంలో మరో మారు సర్వే చేయించి, రైతుల అంగీకారంతో భూ సేకరణ చేపట్టాను. భద్రాచలం ఐటీడీఏ పీఓగా కొండరెడ్ల అభివృద్ధి కోసం ‘గోల్కొండ హ్యాండీ క్రాప్ట్’ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నాను. గిరిజనాభివృద్ధికి... ఐటీ డీఏలో ఉద్యోగ రీత్యా గిరిజనాభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గిరిజనులందరికీ అందేలా మరింత సమర్థవంతగా పనిచేయాలి. గిరిజనులు విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఐటీడీఏ ద్వారా తగిన కార్యాచరణ సిద్ధమవుతోంది. మెరుగైన వైద్యం అందేలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక వైద్య నిపుణులతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాజీవ్ నేపథ్యం.. – పేరు : రాజీవ్‌గాంధీ హనుమంతు – జననం :16–06–1987 – తల్లి : వనజాక్షి ( టీచర్) – తండ్రి : కృష్ణారావు ( అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి) – అక్క: యూఎస్‌లో ఎంఎస్ న్యూరాలజీ – భార్య : విజయలక్ష్మి ( ఎల్ఎల్బీ చదివారు) – కుమార్తె : ప్రేరణ – స్వస్థలం : పలాస, శ్రీకాకులం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – విద్యాభ్యాసం: 1 నుంచి 8 వరకు పొలాకి పభుత్వ పాఠశాల, 9,10 పలాస, ఇంటర్ (నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్), ఇంజినీరింగ్(ఆంధ్ర యూనివర్శిటీ) విశాఖపట్నం. – 2010లో సివిల్ సర్వీస్ పరీక్ష రాసి 719 ర్యాంకుతో ఐఆర్‌టీఎస్‌కు ఎంపిక – 2011లో రెండోసారి సివిల్స్ పరీక్ష రాశారు. 131వ ర్యాంకు రావటంతో ఐఏఎస్‌కు ఎంపిక. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందారు. – వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా (ట్రైనీ) పనిచేశారు. – 13–01–2015 ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. – 15–12–2015న భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధుల్లో చేరారు.