Samantha Said What Would I Do In Her Latest Post: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు విడాకలు తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అలాగే కొంచే ఖాళీ సమయం దొరికినా స్నేహితులతో షికార్లు చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువ సమయం ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఇష్టపడుతోంది సామ్. తాజాగా తన స్నేహితులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. సమంత స్నేహితులు రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఈ ఫొటోలో ముగ్గురూ రిక్లైనర్ సోఫాలో పడుకుని ఉండగా రాహుల్ సెల్ఫీ తీశాడు. ఈ ఫొటో స్టోరీలో షేర్ చేస్తూ 'మీరు లేకుండా నేను ఏం చేయగలను' అని రాసుకొచ్చింది సామ్.
సమంత ఇలా కోట్ చేస్తూ రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌ను ట్యాగ్ చేసింది. సమంత అతి సన్నిహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ అనే సంగతి తెలిసిందే. తర్వాత 'సులభతరమైన గతం లేని దృఢమైన వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు' అని మరొక స్టోరీ షేర్ చేసింది సామ్. ఇదిలా ఉంటే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశకి చేరింది. తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతున్న 'యశోద' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తికాగా హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కాతువాకుల రెండు కాదల్, తదిదర బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బీజీగా ఉంది సామ్.
ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment