ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపుతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్పందించారు. సుశాంత్‌ని మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తిగా ప్రేక్షకులు గుర్తించుకోవద్దని, దేశంలోనే అనేక మందికి ఆయన ప్రేరణ కలిగించారని అంకిత గుర్తు చేశారు. ప్రేక్షకులు ఆయనను ప్రేరణ కలిగించే వ్యక్తిగా గుర్తుంచుకోవాలని సూచించారు. సుశాంత్‌తో ఉన్న సాన్నిహిత్యంపై స్పందిస్తూ.. తనకు నటన నేర్పిన గొప్ప వ్యక్తి అని పేర్కొంది. కానీ మీడియాలో సుశాంత్‌పై సొంతంగా కథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు సుశాంత్‌ది చిన్న పిల్లల మనస్థత్వమని, చిన్న విషయాలను సైతం సుశాంత్ ఆస్వాధించేవాడని తెలిపింది. ఆయనకు చాక్లెట్లు, గులాబ్ జామ్‌లంటే చాలా ఇష్టమని పేర్కొంది. అంకిత బుల్లితెర నటిగా, హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment