న్యూడిల్లీ: భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యాల పట్ల సంతృప్తికరంగా లేనని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ తెలిపారు. శశిథరూర్ మాట్లాడుతూ టీమ్‌లో ఆటగాడుగా ఉన్న సమయంలో సచిన్ ఫీల్డ్‌లో సహచరులకు ఇచ్చే సలహాలను చూసి అతను గొప్ప కెప్టెన్ అవుతాడని భావించే వాడినని తెలిపాడు. కాగా 1996 సంవత్సరంలో టెండూల్కర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 73 వన్డే మ్యాచ్‌లకు టెండూల్కర్ సారథ్యం(కెప్టెన్) వహించగా కేవలం 23మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 43మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది.
కాగా సచిన్ కాప్టెన్‌గా ఉన్న సమయంలో జుట్టు పటిష్టంగా లేదని, ఆ టైమ్‌లో ఆటగాళ్లకు ప్రేరణ కలిగించలేకపోయానని సచిన్ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు కెప్టెన్‌గా సరైన విజయాలు రాకపోవడంతో స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి సచిన్ తప్పుకున్నాడు. కొద్ది కాలానికి తిరిగి కెప్టెన్సీని తీసుకోమని మేనేజ్‌మెంట్ నుంచి ఒత్తిడి వచ్చినా సచిన్ సున్నితంగా తిరస్కరించాడని శశిథరూర్ పేర్కొన్నాడు. (చదవండి: ధోని, సచిన్‌లు నన్ను నిరాశపరిచారు: శశిథరూర్)
Comments
Please login to add a commentAdd a comment