
ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ ద్వారా జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూచనలు చేశారు. యుక్త వయసులో ఉన్నవారు తాను చెప్పే ఆరు సూత్రాలు పాటిస్తే జీవితంలో ఉన్నతస్థానంలో ఉంటారని గోయెంకా పేర్కొన్నారు.
ఆ ఆరు సూత్రాలు ఏంటంటే.. 'అప్పులకు దూరంగా ఉండండి... పేరు ప్రఖ్యాతలను సంపాధించగల నైపుణ్యాలను తెలుసుకోండి... సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించుకోండి.... టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ప్రయత్నించండి.. ఇతరుల అభిప్రాయాల గురించి బాధపడకండి... విషయాల కంటే నేర్చుకోవడం లేదా అనుభవాల మీద దృష్టి పెట్టండి' అంటూ ఆరు సూత్రాలను చెప్పుకొచ్చారు.
హర్ష్ గొయొంకా చేసిన కామెంట్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచించేలా విధంగా ఉన్నాయి. గొయొంకా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారి వేలల్లో లైక్స్ వచ్చాయి. నెటిజన్లు స్పందిస్తూ... మీరు చెప్పినవన్నీ నిజాలే సార్.. కానీ యుక్త వయసుకు పరిమితి ఎంత అనేది స్పష్టం చేయండి.. ఇలాంటివి ఈరోజుల్లో ఎంతో అవసరం.. మీరు చెప్పనవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment