
న్యూఢిల్లీ: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రీంట్రీ కోసం ఆసక్తి చూపడంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. గౌతం గంభీర్ శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ యువరాజ్ సింగ్ పంజాబ్ క్రికెట్‌లో డొమస్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. అయితే యూవీ తిరిగి క్రికెట్ ఆడడం రావడం అతని వ్యక్తిగతమని, కానీ యూవీ ఫ్యాన్స్‌కు, క్రికెట్ అభిమానులకు చాలా సంతోషిస్తారని తెలిపారు.
కాగా గంభీర్, యువరాజ్ ఆటగాళ్లుగా ఉన్న సమయంలో టీ 20 ప్రపంచ కప్(2007), వన్డే ప్రపంచ కప్(2011) గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో క్రికెట్ పట్ల ఆసక్త ఉన్న యువత మాత్రం యువరాజ్ తిరిగి క్రికెట్‌కు రీఎంట్రీ ఇచ్చి తమకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment