హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ సోమవారం 38వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గంభీర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు, అభిమానులు గంభీర్ సాధించిన అపూర్వ విజయాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను జోడించి అతడికి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గంభీర్‌కు డిఫరెంట్‌గా విషెస్ చెప్పి నవ్వులు పూయించాడు. ‘జన్మదిన శుభాకాంక్షలు సోదరా! బర్త్‌డే కేక్ ఎక్కడా? ఓహ్ దాని దారిలో అది ఉందా?. ప్రేమానురాగాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరపుకోవాలి నేతాజీ’అంటూ యువీ ట్వీట్ చేశాడు.
దీనికి సమాధానంగా ‘కృతజ్ఞతలు సోదరా! కేక్ దాని మార్గంలో అది ఉంది. నాతో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు నువ్వు నీ మార్గంలో ఉండాలి’ అంటూ గౌతమ్ గంభీర్ రీట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం వీరద్దిరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మీరిద్దరూ నిజమైన చాంపియన్లు.. ప్రపంచకప్‌లో మీరు చేసిన పోరాటం ఇంకా మా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో శతకాలు బాదిన నాలుగో క్రికెటర్ గంభీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. బీసీసీఐతో పాటు టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా గంభీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హ్యాపీ బర్త్‌డే గంభీర్.. కేక్ ఎక్కడా?
Published Mon, Oct 14 2019 6:38 PM | Last Updated on Mon, Oct 14 2019 6:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment