Gambhir, Yuvraj and others to play for New Jersey Legends in US Masters T10 League - Sakshi
Sakshi News home page

T10 League: బ్యాట్‌ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్‌.. ఫ్యాన్స్‌కు పండగే

Jul 13 2023 10:42 AM | Updated on Jul 13 2023 10:57 AM

Yuvraj-Gambhir-Other Legendary Stars-Likely Play-US Masters T10-League - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ సహా మరికొంత మంది స్టార్స్‌ మళ్లీ బ్యాట్‌ పట్టనున్నారు. యూఎస్ మాస్టర్స్ టి10 లీగ్‍లో ఆడనున్నారు. ఈ లీగ్‌లో భారత్‍తో పాటు మరిన్ని దేశాల మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. అట్లాంటా ఫైర్, కాలిఫోర్నియా నైట్స్, మారిస్‍విల్లే యూనిటీ, న్యూజెర్సీ లెజెండ్స్, న్యూయార్క్ వారియర్స్, టెక్సాస్ చార్జర్స్  ఉన్నాయి. కాగా నార్త్ కాలిఫోర్నియాలో తాజాగా ఈ టోర్నీ ప్లేయర్స్ డ్రాఫ్ట్ వెల్లడైంది. 

న్యూజెర్సీ లెజెండ్స్‌:
న్యూజెర్సీ లెజెండ్స్ టీమ్‍లో భారత మాజీ స్టార్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, యుసూఫ్ పఠాన్ ఉన్నారు. వీరితో పాటు స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, బిపుల్ శర్మ, లియామ్ ప్లంకెట్, అల్బీ మార్కెల్, నమన్ ఓజా, జెర్రీ రైడర్, క్రిస్ బ్రాన్‍వెల్, క్రెగ్ మెక్‍మిలాన్, టిమ్ ఆంబ్రోస్, అభిమన్యు మిథున్, మోంటీ పనేసర్ ఈ జట్టులో ఆడనున్నారు.

కాలిఫోర్నియా నైట్స్‌:
కాలిఫోర్నియా నైట్స్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్ ఆడనున్నారు. ఆరోన్ ఫించ్, పీటర్ సిడిల్, జాక్వెస్ కలీస్ సహా మరికొందరు ఈ జట్టులో ఉన్నారు.

అంట్లాట ఫైర్:
అంట్లాట ఫైర్ జట్టులో రాబిన్ ఊతప్ప ఉన్నాడు. ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ హస్సీ కూడా ఈ జట్టు తరఫున ఆడనున్నాడు. శ్రీశాంత్, లెండిల్ సిమండ్స్, డ్వేన్ స్మిత్ సహా మరికొందరు స్టార్ల్ ఉన్నారు.

మోరిస్‍విల్లే యునిటీ:
యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‍లో మోరిస్‍విల్లే యునిటీ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. పార్థివ్ పటేల్, కెవిన్ ఓబ్రెయిన్, కోరీ ఆండర్సన్, రాహుల్ శర్మ, కెల్విన్ సావేజ్.. మరికొంత మంది ప్లేయర్లు ఈ జట్టులో ఆడనున్నారు.

న్యూయార్క్ వారియర్స్:
న్యూయార్క్ వారియర్స్ టీమ్‍లో భారత మాజీలు మురళీ విజయ్, మునాఫ్ పటేల్ ఉన్నారు. పాకిస్థాన్ మాజీలు షాహిద్ ఆఫ్రిదీ, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్ ఈ జట్టులోనే ఆడనున్నారు. జోహాన్ బోతా, టీఎం దిల్షాన్ సహా మరికొందరు ఉన్నారు.

టెక్సాస్ చార్జర్:
టెక్సాస్ చార్జర్ టీమ్‍లో ప్రజ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. బెన్ డక్, హమ్మద్ హఫీజ్, రాస్ టేలర్, ఇసురు ఉదానా, తిషారా పెరీరా, నీల్ బ్రూమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఉపుల్ తరంగ, జీవన్ మెండిస్ సహా మరికొందరు ప్లేయర్లు ఈ జట్టు తరఫున యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‍లో బరిలోకి దిగనున్నారు.

చదవండి: Kohli-Ishan Kishan Viral Video: కోహ్లిని టీజ్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌.. వీడియో వైరల్‌

R Ashwin Record In Test Cricket: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement