టీ10 క్రికెట్‌లో సంచనలం నమోదైంది. జిమ్ ఆఫ్రో లీగ్-2024లో స్కాట్లాండ్ క్రికెటర్ జార్జ్ మున్సే సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. డర్బన్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్సే (హరారే బోల్ట్స్) కేవలం 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జిమ్ ఆఫ్రో లీగ్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ.
మున్సే సెంచరీతో శివాలెత్తడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హరారే బోల్ట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. బోల్ట్స్ ఇన్నింగ్స్‌లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో (29) అత్యధిక పరుగులు వచ్చాయి. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్ షనక 7 పరుగులు చేశారు. వోల్వ్స్ బౌలర్లలో దౌలత్ జద్రాన్ రెండు వికెట్లు తీశాడు.
174 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వోల్వ్స్.. ఏ దశలో గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కొలిన్ మున్రో (32), షర్జీల్ ఖాన్ (25), విల్ స్మీడ్ (16), ఇన్నోసెంట్ కాలా (16), రిచ్‌మండ్ ముతుంబామి (15) రెండంకెల స్కోర్లు చేశారు. బోల్ట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, బ్రాండన్ మవుటా, దసున్ షనక, జేమ్స్ నీషమ్, అరినెస్టో వెజా తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..!
Comments
Please login to add a commentAdd a comment