మస్క్.. టికెట్‌ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా | Where Can I Buy My Ticket Elon Musk Anand Mahindra Tweet | Sakshi
Sakshi News home page

మస్క్.. టికెట్‌ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా

Published Mon, Oct 14 2024 2:56 PM | Last Updated on Mon, Oct 14 2024 3:22 PM

Where Can I Buy My Ticket Elon Musk Anand Mahindra Tweet

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ  వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఆదివారం స్పేస్‌ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్‌ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్‌ను ప్రశంసించారు.

మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్‌గా.. స్టార్‌షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్‌ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!

ఇలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్‌ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement