చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే? | Know Reason Behind Why Anand Mahindra Requested ChatGPT After India's Cricket World Cup Win, Tweet Inside | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?

Published Sun, Jun 30 2024 9:37 PM | Last Updated on Mon, Jul 1 2024 10:36 AM

Anand Mahindra Request To ChatGPT

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్‌జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్‌హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్‌గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో..  క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement