సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా | Service Would Look Like Anand Mahindra Tweet Viral | Sakshi
Sakshi News home page

సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా

Published Fri, May 3 2024 6:26 PM | Last Updated on Fri, May 3 2024 7:28 PM

Service Would Look Like Anand Mahindra Tweet Viral

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పెద్ద ఫర్నిచర్‌ను.. ఒక చిన్న స్కూటర్ మీద తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా అని నేను ఊహిస్తున్నాను అంటూ ఓ ఎమోజీ యాడ్ చేశారు.

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందింది. రెండు వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూపరులను తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావిస్తున్నాము.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement