
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఉండే ఆయన ఇటీవల ఒక వీడియోని ట్విటర్ ద్వారా షేర్ చేసి కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ'జీ ఇలాంటి అద్భుతాలు మన దేశంలో కుదురుతుందా? అంటూ ప్రశ్నించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నెదర్లాండ్స్‌లోని రివర్స్ బ్రిడ్జిగా ప్రసిద్ధి చెందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో నది మీద నిర్మించిన రోడ్డు మీద వాహనాలు వేగంగా వస్తూ పోతూ ఉన్నాయి. అయితే రోడ్డుకి మధ్యలో కట్ అయినట్లు, మధ్యలో నీటి కాలువ ఉన్నట్లు చూడవచ్చు. ఇది చూస్తే ఒక్కసారిగా వాహనాలు నదిలోకి వెళ్లాయా అనిపిస్తుంది, కానీ అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించిన ఈ రోడ్డు పైన బోట్స్, కింద వెహికల్స్ ప్రయాణించేలా నిర్మించారు.
(ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - లాయర్ దెబ్బకు ఖంగుతిన్న మెటా!)
Wait…What?? Can we do this too, @nitin_gadkari ji? 😊 pic.twitter.com/SNjRry5rup
— anand mahindra (@anandmahindra) June 12, 2023
నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ చేశారు. ఇంజినీర్లు వాహనాలు కింద వెళితే, బోట్లు పైన వెళ్లాలా రూపొందించారు. ఈ నిర్మాణానికి సామాన్యులే కాదు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. దీంతో మన దేశంలో ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతాయా? అంటూ నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనిపైన కొంతంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.