నిత్యం టెక్నాలజీలో మార్పులు వస్తోన్నాయి. అందులో చాలా వరకు మనుషులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తుంటే.. మరికొన్ని మనుషులను సోమరులుగా చేసేవి వస్తున్నాయి. మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలను తెలియజేసేందుకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ వీడియోలో.. షాపింగ్‌మాల్‌లో ఓ యువకుడు ఒక చేతిలో పాప్‌కార్న్, మరో చేతిలో కూల్‌డ్రింక్ పట్టుకుని సింగిల్ వీల్ ఏఐ స్కూటర్‌పై వెళుతుంటాడు. కళ్లకు విజన్ ప్రో అద్దాలు, స్కూటర్ హ్యాండిల్‌కు రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. టెక్నాలజీతో పూర్తిగా కనెక్టయి.. వాస్తవ ప్రపంచంతో డిస్‌కనెక్ట్ అయ్యాడని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలగానే ఉండనుందని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..!
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనతో ఏకీభవిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘టెక్నాలజీ వచ్చాక చాలామంది పిల్లలు తమ బాల్యాన్ని సరిగా ఆస్వాదించడం లేదు’. ‘రాబోయే రోజుల్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పరిస్థితి ఉండదు. ఎక్కువగా మెషీన్లతోనే కనెక్ట్ అవుతారు’అని కామెంట్లు వస్తున్నాయి.
Completely plugged in…
— anand mahindra (@anandmahindra) March 11, 2024
And yet,
Completely disconnected.
If this is the future, then it’s a nightmare….
pic.twitter.com/8i8IapgQYu
Comments
Please login to add a commentAdd a comment