టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Teamwork And Timing Says Anand Mahindra | Sakshi
Sakshi News home page

టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Sat, Jun 29 2024 9:30 PM | Last Updated on Sun, Jun 30 2024 6:26 PM

Teamwork And Timing Says Anand Mahindra

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నలుగురు వ్యక్తులు నిలబడి ఉండటం చూడవచ్చు. మొదటి వ్యక్తి కొంత పైకి ఎగిరి రింగ్‌లో దూరాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి రింగును వెనక్కు వేగంగా పంపించారు. అదే సమయంలో వెనుక వున్న వ్యక్తులు కూడా కొంత ఎగిరి ఆ రింగు గుండా బయటకు వచ్చేస్తారు. ఈ సన్నివేశం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ వర్క్ అండ్ టైమింగ్.. ఈ రాత్రికి లెక్కించబడుతుంది. గో ఇండియా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement