ind vs south africa
-
టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నలుగురు వ్యక్తులు నిలబడి ఉండటం చూడవచ్చు. మొదటి వ్యక్తి కొంత పైకి ఎగిరి రింగ్‌లో దూరాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి రింగును వెనక్కు వేగంగా పంపించారు. అదే సమయంలో వెనుక వున్న వ్యక్తులు కూడా కొంత ఎగిరి ఆ రింగు గుండా బయటకు వచ్చేస్తారు. ఈ సన్నివేశం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ వర్క్ అండ్ టైమింగ్.. ఈ రాత్రికి లెక్కించబడుతుంది. గో ఇండియా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.Teamwork… and TimingIt’s what’s going to count tonight..Go #TeamIndia !#INDvsSA #T20WorldCupFinal 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/6aovoJZpX6— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
వీడియో వైరల్: వాహ్.. వాటే క్యాచ్.. ఆల్ టైం గ్రేట్ క్యాచ్!
అప్పుడప్పుడూ క్రికెట్లో అసాధారణ విన్యాసాలు చూస్తూ ఉంటాం. బ్యాట్స్‌మెన్ అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావొచ్చు.. ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు కావొచ్చు. ఇలా ఎన్నో సూపర్మూమెంట్స్ను ఆస్వాదిస్తూ ఉంటాం. ఇలా ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాల కావొస్తున్నా ఆ విన్యాసం మాత్రం ఇప్పటికీ వావ్ అనిపిస్తోంది. 1997లో కేప్‌టౌన్ వేదికగాభారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఫీల్డింగ్ మూమెంట్ అబ్బురపరచడమే కాదు.. ఆల్ టైమ్ టాప్-10 క్యాచెస్‌లో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1997లొ కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ జరగ్గా, ఆడమ్ బాచెర్ ఒక క్యాచ్ అందుకున్నాడు. అది కూడా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్యాచ్. మెక్మిలాన్ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయిన సచిన్.. ఆడమ్ మార్క్ బాచెర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ షాట్‌ను కచ్చితంగా ఫోర్ వెళుతుందని ఊహించిన సచిన్.. బాచెర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా భారంగా పెవిలియన్ వీడాడు. బంతి గాల్లో ఉండగానే దాన్ని వెంటాడిన బాచెర్.. ఒంటి చేత్తో అందుకుని శభాష్ అనిపించాడు. నేడు(అక్టోబర్ 29వ తేదీ) మార్క్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ సుప్రిమో ఆలీ బాచెర్ మేనల్లుడే మార్క్ బాచెర్. ఆనాటి మ్యాచ్ సదరు ఇన్నింగ్స్‌లో సచిన్ 169 పరుగులు చేశాడు. Happy Birthday Adam Bacher 🇿🇦. The nephew of cricket supremo Ali Bacher. Played 19 Tests & Scored 833 with 96 His top Score One of Best Catch he Taken in 90s of @sachin_rt in Cape Town 1997 & even this catch should in all time top 10 catches. pic.twitter.com/20eEI0gnwV— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) October 29, 2022 -
రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం (ఫొటోలు)
-
కేశవ్ మహరాజ్ 'జై శ్రీరామ్'.. అభిమానుల ప్రశంసల వర్షం
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసింది. ప్రొటీస్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలనే కోరిక టీమిండియాకు అలాగే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ షేర్ చేసిన పోస్టులో జై శ్రీరామ్ అని పెట్టడం ఆసక్తి కలిగించింది. '' టీమిండియాతో సిరీస్ గెలవడం మాకు గర్వంగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో ఓటమి అనంతరం మా గడ్డపై టీమిండియాను ఓడించడం మంచి బూస్టప్‌ను అందించింది. ఇక్కడితో ఇది ఆగిపోదు.. తర్వాతి సిరీస్‌కు మరింతగా సన్నద్ధమవ్వబోతున్నాం.. జై శ్రీరామ్'' అంటూ ముగించాడు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' అయితే మహరాజ్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. ''జై శ్రీరామ్ అని పెట్టిన కేశవ్ మహరాజ్.. తన భారతీయ మూలాలను ఇంకా మరిచిపోలేదు. ఇది గొప్ప విషయం.'' అంటూ కామెంట్ చేశారు. ఇక 31 ఏళ్ల కేశవ్ మహరాజ్ భారత సంతతికి చెందినవాడు. అతని చిన్నప్పుడే కుటుంబం సౌతాఫ్రికాలో స్థిరపడింది. ఇంకో విశేషమేమిటంటే.. కేశవ్ మహరాజ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో జై శ్రీరామ్.. జై శ్రీ హనుమాన్ అని రాసి ఉంటుంది. 2016లో సౌతాఫ్రికా తరపున అంతర్జాతీ క్రికెట్లో అరంగేట్రం చేసిన కేశవ్ మహరాజ్ అనతికాలంలోనే జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఈ మధ్య కాలంలో రెగ్యులర్ స్పిన్నర్‌గా మారిన కేశవ్ మహరాజ్ 39 టెస్టుల్లో 130 వికెట్లు, 18 వన్డేల్లో 22 వికెట్లు, 8 టి20ల్లో ఆరు వికెట్లు తీశాడు. చదవండి: శార్ధూల్, దీపక్ చాహర్‌లపై టీమిండియా కోచ్ ప్రశంసలు -
కోహ్లి ఇది మంచి పద్దతి కాదేమో!
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా విషయంలో టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కోహ్లి బవుమాపై అసభ్యరీతిలో కామెంట్స్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కేఎల్ రాహుల్ డైరెక్ట్ త్రోకు టెంబా బవుమా రనౌట్ అయ్యాడు. పెవిలియన్ వెళ్తున్న బవుమాను ఉద్దేశించి కోహ్లి.. ''బాగ్ రహా తా మద్..'' అంటూ బూతు మాటలు పలికాడు. కోహ్లి పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు కూడా ఏం పట్టనట్లే ఉన్నారు. అయితే ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఇక తొలి వన్డేలో బవుమా, కోహ్లి మధ్య చిన్నపాటి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పంత్‌కు త్రో వేయబోయిన బంతి బవుమాకు తగలడం.. ఆ తర్వాత బవుమా ఆగ్రహం వ్యక్తం చేయడం.. బదులుగా కోహ్లి అతనిపై కోపం చూపించడంతో రచ్చగా మారింది. అదే గొడవ ఇప్పటికి ఇద్దరి మధ్య వైరం నడిపిస్తూనే ఉంది. తాజా అంశంలో అందరూ కోహ్లినే తప్పుబడుతున్నారు. ఇప్పటికే జాతీయ గీతాలపన సమయంలో చూయింగ్ గమ్ నమిలి అనుచితంగా ప్రవర్తించిన కోహ్లిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా చర్యతో కోహ్లిపై మరింత ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చదవండి: 70 బంతుల్లో 236 పరుగులతో విధ్వంసం; బౌలర్ బూతుపురాణం #SAvsIND Bavuma run-out pic.twitter.com/8EvTTKYVFL — Amanpreet Singh (@AmanPreet0207) January 23, 2022 -
ఫామ్‌లో లేడనుకున్నాం.. దుమ్మురేపుతున్నాడు; టార్గెట్ అదేనా?
టీమిండియాతో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు డికాక్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. అంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన డికాక్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో వన్డే, టి20 క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే టీమిండియాతో వన్డే సిరీస్ మొదలవగానే డికాక్ జూలు విదిల్చాడు. తొలి మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన డికాక్.. రెండో వన్డేలో 66 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మూడో వన్డేలో టీమిండియాకు తన విశ్వరూపమే చూపెట్టాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేసిన డికాక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.. ►డికాక్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. హషీమ్ ఆమ్లా(23 సెంచరీలు), హర్షలే గిబ్స్(18 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. తాజా సెంచరీతో డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ►టీమిండియాపై డికాక్‌కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఆటగాడిగా డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య( ఏడు సెంచరీలు) ఉన్నాడు. ►డికాక్ తాను సాధించిన 17వ సెంచరీతో.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. కుమార సంగక్కర 23 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. ►టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా డికాక్ నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై 23 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు సాధించాడు. ► టీమిండియాపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ మెగావేలంపై కన్నేసిన డికాక్.. అసలు ఫామ్‌లో లేని డికాక్ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్ మెగా వేలంపై కన్నువేశాడు. ఇంతకముందు సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన డికాక్... ఇటీవలే తన పేరును రూ.2 కోట్లకు రిజిస్టర్ చేసుకున్నాడు. అతను ఉన్న ఫామ్ దృశ్యా వేలంలో మంచి ధరకే పలికే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. ఇక ఐపీఎల్ 2022 కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. -
కేఎల్ రాహుల్ సూపర్ త్రో.. బవుమా రనౌట్
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో మెరిశాడు. రాహుల్ త్రో దెబ్బకు బవుమా రనౌట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 8 పరుగులతో బవుమా మంచి టచ్‌లో కనిపించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతిని బవుమా మిడాఫ్ దిశగా ఆడాడు. క్విక్ సింగిల్ తీయాలని భావించిన బవుమా చేతులు కాల్చుకున్నాడు. రిస్క్ అని తెలిసినప్పటికి పరిగెత్తాడు.. అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. డైరెక్ట్ హిట్‌తో బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం బవుమా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా.. డుసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. pic.twitter.com/6hgPJzK4Pd — Bleh (@rishabh2209420) January 23, 2022 -
రుతురాజ్‌ను పక్కనపెట్టి తప్పుచేస్తున్నారు.. అవకాశమివ్వండి
IND Vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా తాజాగా వన్డే సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రత్యర్థికి అప్పగించింది. కోహ్లి కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు నిజంగా బ్యాడ్‌లక్ . తాను కెప్టెన్సీ వహిస్తున్న మొదటి సిరీస్‌ను టీమిండియా ఓడిపోవడంతో కలిసి రాలేదని చెప్పొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేసి పెద్ద తప్పు చేస్తున్నారు. అవకాశం ఇస్తేనే కదా అతనేంటో నిరూపించుకునేదంటూ అభిప్రాయపడుతున్నారు. జట్టు కూర్పులో ఇప్పుడున్న పరిస్థితిలో వెంకటేశ్ అయ్యర్‌ను జట్టు నుంచి తొలగించి రుతురాజ్‌కు అవకాశం ఇవ్వడం మంచిదని చాలామంది పేర్కొంటున్నారు. చదవండి: Ashleigh Barty: క్రికెట్లో ఆడాల్సిన షాట్ టెన్నిస్‌లో ఆడితే.. వాస్తవానికి రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్మురేపి సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన విషయం మరవకూడదు. అంతకముందు జరిగిన ఐపీఎల్ 14వ సీజన్లోనూ రుతురాజ్ లీగ్ టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా తుది జట్టులోకి ఎందుకు పరిశీలించడం లేదో అర్థం కావడం లేదు. దీంతోపాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో టీమిండియా రెండుగా చీలిందని.. కోహ్లి, కేఎల్ రాహుల్‌లు ఎడమొహం.. పెడమొహంలాగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా టీమిండియా సిరీస్ ఓడిపోవడంతో.. టీమిండియా జట్టులో ఐక్యత లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందనే వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. కోహ్లి కెప్టెన్సీ వహించని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవడం గమనార్హం. చదవండి: టీమిండియాపై వన్డే సిరీస్ గెలుపు.. ఇంతలోనే ఐసీసీ అక్షింతలు ఇక టీమిండియా సిరీస్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడో వన్డేకైనా జట్టును కాస్త మార్చండరా బాబు అని మొరపెట్టుకున్నారు. సౌతాఫ్రికా పర్యటన టీమిండియాకు ఒక పీడకల.. టెస్టు సిరీస్ పోయింది.. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా పాయే.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు ఏం జరుగుతుంది.. రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు బెంచ్‌కు పరిమితం చేశారు.. టాలెంట్‌ను గుర్తించడం లేదు.. అంటూ ట్విటర్‌ను మోతెక్కిస్తున్నారు. What a nightmare tour for India - didn't see this coming after that 1st Test. South Africa have outplayed them big time since the Centurion match, well played. #SAvsIND #INDvSA #INDvsSA — CricBlog ✍ (@cric_blog) January 21, 2022 Selfish KLR denying an opportunity to Ruturaj Gaikwad by opening instead of playing in the middle order just because he stole the Orange Cap from him 😭😭😭😭 — ` (@FourOverthrows) January 19, 2022 ◆ Ruturaj Gaikwad * Plays explosive in IPL and domestic * Gets selected for International * Practices with other team members * Attend photoshoot session * Rests on bench * Repeat 🔁 — Umakant (@Umakant_27) January 18, 2022 Kuldeep Yadav watching match between #INDvsSA #BCCIPolitics pic.twitter.com/pyIwzry4vw — 🦁 Kohlistaan (@Pantastics) January 21, 2022 -
జట్టుకు భారమయ్యాడు.. తొలగించే సమయం ఆసన్నమైంది
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న భువీ.. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేలు కలిపి 18 ఓవర్లు వేసిన భువీ 7.27 ఎకానమీతో 131 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భువనేశ్వర్ గతేడాది ఐదు వన్డేలు ఆడి 9 వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది మంచి ప్రదర్శనే అయినప్పటికి భువీ మునపటి ఫామ్‌ను చూపట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆరంభంలో.. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం.. తన కోటా బౌలింగ్‌లో డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం.. పొదుపుగా బౌలింగ్ చేయడం భువనేశ్వర్ స్పెషాలిటీ. 2022కు ముందు 42.6 గా ఉన్న డాట్‌బాల్స్ పర్సంటేజీ ఇప్పుడు 61.5కు పెరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2022 టి20 వరల్డ్‌కప్ వరకు భువనేశ్వర్ టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భువీని జట్టు నుంచి తొలగించాల్సిన సమయం వచ్చేసిందంటూ పేర్కొంటున్నారు. మూడో వన్డేకు అతని స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడం మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేయడంలో దిట్ట అయిన దీపక్ చహర్ టీమిండియా తరపున 5 వన్డేలు, 17 టి20లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక దీపక్ చహర్ బ్యాటింగ్‌లోనూ చేయిందించగల సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా భువనేశ్వర్ స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడమే కరెక్టని అభిప్రాయపడ్డాడు. ఇక భువనేశ్వర్ టీమిండియా తరపున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 55 టి20ల్లో 53 వికెట్లు తీశాడు. -
పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్ ప్రశంసల వర్షం
Tabraiz Shamsi Praise Rishabh Pant Batting.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పంత్ బ్యాటింగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. 71 బంతుల్లో 85 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. పంత్ బ్యాటింగ్‌లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించలేదు. ఆడినంతసేపు దూకుడు కనబరిచిన పంత్.. సౌతాఫ్రికా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టాడు. ఇదే అంశం సౌతాఫ్రికా బౌలర్ షంసీని బాగా ఆకట్టుకుంది. అందుకే పంత్ తన బౌలింగ్‌లో ఔటై వెళ్లిపోతున్నప్పుడు.. షంసీ తన చేతులతో వెనుక నుంచి పంత్ భుజాన్ని తడుతూ.. బాగా ఆడావన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా షంసీ ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ;''బాగా కష్టపడ్డాడు.. బాగా ఆడాడు.. ఒక్కసారి గీత దాటలేదు.. '' అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ జత చేశాడు. చదవండి: Rishabh Pant: 'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్ సాధించాడు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డి కాక్ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్ -
'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్ సాధించాడు'
సౌతాఫ్రికా గడ్డపై రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో 85 పరుగులతో ఆకట్టుకున్న పంత్.. ఆ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. పంత్ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్(77 పరుగులు, 2001) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్ ధోని(65 పరుగులు, 2013), రాహుల్ ద్రవిడ్( 62, వర్సెస్ ఇంగ్లండ్, 2003 వన్డే ప్రపంచకప్), ఎంఎస్ ధోని(55 పరుగులు,2006), సబా కరీమ్(55 పరుగులు, 1997) ఉన్నారు. దీంతో ధోని, ద్రవిడ్‌లకు సాధ్యం కానిది పంత్ సాధించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్ ఇక గత వన్డే మ్యాచ్ ద్వారా బ్యాటింగ్‌లో నాలుగో స్థానానికి ప్రమోషన్ పొందిన పంత్ ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పంత్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పంత్ సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడూ కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా నడిచింది. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో 85 పరుగుల వద్ద పంత్ షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చదవండి: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది -
డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లికి ఇది 450వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. వన్డేల్లో 14వ సారి డకౌట్ అయిన కోహ్లి.. తన చర్యతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్‌లో 85 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పంత్‌ను అభినందిస్తూ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ నుంచి అతన్ని అభినందిస్తూ డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. భయం అనేది లేకుండా సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన పంత్ ఆటతీరుకు ముగ్దుడైన విరాట్.. తన చేతులతో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కోహ్లి పక్కనే కూర్చున్న శిఖర్ ధావన్.. అతని డ్యాన్స్ చూస్తూ నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: లడ్డూలాంటి అవకాశం.. బతికిపోయిన కేఎల్ రాహుల్ ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: 450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు Virat kohli is such a mood 🤣✨ pic.twitter.com/yjC6XTlJIw — Siddhi :) (@_sectumsempra18) January 21, 2022 -
అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పంత్‌తో జరిగిన సమన్వయ లోపం వల్ల కేఎల్ రాహుల్ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఆఖరి బంతిని పంత్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినా కేఎల్ రాహుల్ క్విక్ సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న పంత్ వద్దని చెబుతున్నప్పటికి.. అప్పటికే రాహుల్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు చేరుకున్నాడు. చదవండి: 450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు ఇంతలో బంతిని అందుకున్న బవుమా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసురుదామనుకున్నాడు. ఇక రాహుల్ ఔట్ అని మనం అనుకునేలోపు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బవుమా సరైన దిశలో బంతిని వేయకపోవడం.. కేశవ్ మహరాజ్ దానిని అందుకోవడం విఫలమవ్వడం.. అప్పటికే రాహుల్ వేగంగా పరిగెత్తి క్రీజులోకి చేరుకోవడం జరిగిపోయింది.అలా టీమిండియా బతికిపోయింది.. రాహుల్ కూడా బతికిపోయాడు. ఈ సంఘటన తర్వాత రాహుల్ పంత్‌వైపు.. ''అరె పంత్.. కొంచమైతే కొంపముంచేవాడివి అన్నట్లుగా'' చూశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 😭#SAvIND pic.twitter.com/nGoDadBwAF — ًFaf Du Plessis (@Fad_du_pussy) January 21, 2022 -
450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు
మైల్స్టోన్ మ్యాచ్ అంటే ఒక బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌కు దానిని గొప్పగా మలుచుకోవాలని భావిస్తారు. కోహ్లి కూడా తన 450వ మ్యాచ్‌లో సూపర్‌గా ఆడాలనుకున్నాడు. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఫలితంగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదు బంతులాడిన కోహ్లి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా వన్డేల్లో కోహ్లి డకౌట్ అవ్వడం ఇది 14వ సారి కాగా.. ఒక స్పిన్నర్ బౌలింగ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. తన 450వ మ్యాచ్‌లో కోహ్లి ఒక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీమిండియా తరపున వన్డే క్రికెట్లో అత్యధిక డకౌట్ల విషయంలో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్లను కోహ్లి దాటేశాడు. కపిల్, ద్రవిడ్‌లు వన్డేల్లో 13సార్లు డకౌట్ కాగా.. తాజా ఔట్‌తో కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్, జహీర్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్ టెండూల్కర్ (20 డకౌట్లు), జగవల్ శ్రీనాథ్ (19 డకౌట్లు), అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌లు 18 డక్‌లతో, హర్భజన్ సింగ్ 17 డకౌట్లతో, గంగూలీ 16 డకౌట్లతో ఉన్నారు. -
'భయ్యా నేనంత సోమరిని కాదు.. కావాలంటే చెక్ చేసుకో'
ఆటలో కామెంటరీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న అభిమానులకు తమ పదునైన మాటలు.. క్రీడా విశ్లేషణలతో మరింత రసవత్తరంగా మార్చడం కామెంటేటర్ల పని. అయితే కొన్ని సందర్భాల్లో కామెంటేటర్లు కూడా తమకు తెలియకుండానే నోరు జారడం చూస్తుంటాం. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ బంగర్ అదే తప్పు చేశాడు. ఆట బ్రేక్ సమయంలో మైక్ ఆఫ్ చేయడం మరిచిపోయిన సంజయ్ మైక్ రికార్డర్లో అడ్డంగా దొరికిపోయాడు. టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. చదవండి: జింబాబ్వే బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు టీమిండియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 39వ ఓవర్ పూర్తైన తర్వాత బ్రాడ్‌కాస్టర్ బ్రేక్ ఇవ్వాలి. కానీ స్కోర్ కార్డ్ చూపించడం.. అదే సమయంలో బ్రేక్ అని భావించిన బంగర్ మైక్ ఆఫ్ చేయకుండానే బ్యాక్ఎండ్ టీంతో పర్సనల్ విషయాలు మాట్లాడాడు. ''నేనంత సోమరిని కాదు భయ్యా.. కావాలంటే చెక్ చేసుకో'' అంటూ పేర్కొన్నాడు. అయితే బ్రేక్ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బంగర్ తన పొరపాటును గుర్తించి నవ్వుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ బంగర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ #SAvsIND pic.twitter.com/HYgiAx7VkJ — Amanpreet Singh (@AmanPreet0207) January 20, 2022 -
డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో పంత్ ఔటైనప్పటికి ఆ క్రెడిట్ మొత్తం కీపర్ క్వింటన్ డికాక్‌కే దక్కుతుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స 35వ ఓవర్ తొలి బంతిని ఫెహ్లుక్వాయో లెగ్‌సైడ్ వేయగా.. పంత్ దానిని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అవడం.. పంత్ క్రీజులో నుంచి బయటికి రావడం ఒకేసారి జరిగిపోయింది. ఇక్కడే కీపర్ డికాక్ మెరుపు వేగంతో స్పందించాడు. పంత్ తేరుకునేలోపే సెకన్ల వ్యవధిలో డికాక్ బెయిల్స్ ఎగురగొట్టడం జరిగిపోయింది. దీనిపై లెగ్ అంపైర్ థర్డ్అంపైర్ను కోరగా.. బిగ్‌స్క్రీన్‌లో పంత్ కాలు గాల్లోనే ఉండడం స్పష్టంగా కనిపించడంతో ఔట్ అని తేలింది. దీంతో 16 పరుగులు చేసిన పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. Did you see that?👀 #SAvIND #BetwayODISeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/bWLdyNIySx — Cricket South Africa (@OfficialCSA) January 19, 2022 -
కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 36వ ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ బవుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే పంత్ వైపు వేసే ఉద్దేశంతో కోహ్లి బంతిని బలంగా విసిరాడు. పొరపాటున బంతి బవుమాకు తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం.. ఇక్కడితో ఇది ముగిసిదనుకుంటే.. బవుమా కోహ్లివైపు కోపంగా చూస్తూ.. ''నేను క్రీజులోనే ఉన్నా అలాంటి త్రోలు వేయనవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన మెషిన్‌గన్ బవుమాతో.. ''నేనేం కావాలని నిన్ను కొట్టాలనుకోలేదు.. వికెట్ కీపర్‌కు త్రో వేసే క్రమంలో పొరపాటున తగిలిఉంటుంది.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సాతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు, వాన్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు నాటౌట్‌గా రాణించారు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్ పార్ట్నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. చదవండి: 'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్ pic.twitter.com/fypjtfqCUf — Sunaina Gosh (@Sunainagosh7) January 19, 2022 -
అప్పుడు కెప్టెన్‌గా; ఇప్పుడు ఆటగాడిగా.. తగ్గేదే లే
టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో తన హావభావాలతో ఎన్నోసార్లు అభిమానులను మెప్పించిన కోహ్లి సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి ఏడేళ్ల తర్వాత మళ్లీ సీనియర్ ఆటగాడిగా మ్యాచ్ ఆడుతున్నాడు. చదవండి: నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు వికెట్; బుమ్రా 925 రోజుల నిరీక్షణకు తెర మొన్నటివరకు టీమిండియా కెప్టెన్‌గా తన సహచరులకు సలహాలు, మార్గనిర్దేశనం చేస్తూ కనిపించిన కోహ్లి... తాజాగా కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సీనియర్ ఆటగాడిగా అదే జోరును చూపించాడు. కేఎల్ రాహుల్‌కు సూచనలు చేస్తూ కనిపించిన కోహ్లి.. సౌతాఫ్రికా వికెట్ పడిన ప్రతీసారి తనదైన జోష్ చూపించాడు.మైదానంలో పాదరసంలా కదులుతూ.. తన సహచర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాతకోహ్లిని చూస్తామని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బవుమా(110), వాండర్ డుసెన్(129*) సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్! -
నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు వికెట్; బుమ్రా 925 రోజుల నిరీక్షణకు తెర
టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ సాధించాడు. 2017లో వెస్టిండీస్‌తో చివరిసారి వన్డే ఆడిన అశ్విన్.. తాజాగా నాలుగేళ్ల తర్వాత సాతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా వికెట్ సాధించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతిని అశ్విన్ రౌండ్ ది వికెట్ వేయగా.. డికాక్ కట్‌షాట్ ఆడాలని భావించాడు. అయితే గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి డికాక్ బ్యాట్‌ను మిస్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: 'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్ 925 రోజుల నిరీక్షణకు తెర.. బుమ్రా పవర్ ప్లేలో ఎట్టకేలకు వికెట్ సాధించాడు. దాదాపు 925 రోజుల పాటు పవర్ ప్లేలో బుమ్రాకు వికెట్ దక్కలేదు. బుమ్రా చివరిసారి 2019 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను పవర్‌ప్లేలో ఔట్ చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఇన్నింగ్స్ 5వ ఓవర్లో జానేమన్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఆ నిరీక్షణకు తెరపడింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా 93, డుసెన్ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్ 19 days into 2022, and it's already gotten me like#SAvIND #INDvSA #Ashwin pic.twitter.com/3YncjDmYfs — Oninthough (@theoninthough) January 19, 2022 -
'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా డెబ్యూ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సూపర్ త్రోతో మెరిశాడు. అతని దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మార్ర్కమ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ నాలుగో బంతిని మార్క్రమ్ మిడాఫ్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినప్పటికి బవుమాకు సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో మార్ర్కమ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి చేరుకునేలోపే వెంకటేశ్ అయ్యర్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. క్రీజుకు కొన్ని ఇంచుల దూరంలో మార్క్రమ్ ఉండగా.. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడం బిగ్స్క్రీన్పై కనిపించింది. ఇంకేముంది మార్క్రమ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చదవండి: డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్ ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మార్క్రమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తొలి వన్డేలో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రిస్క్ అని తెలిసినా అనవసర పరుగుకు యత్నించి చేజేతులా మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం Aiden Markram wicket !! #SAvsIND #venkateshiyer pic.twitter.com/H3RlkwZHEl — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) January 19, 2022 -
ప్రొటీస్ గడ్డపై కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇక వన్డేల్లో టీమిండియాకు 26వ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించనున్నాడు. చదవండి: 'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే ఇదే సమయంలో సౌతాఫ్రికా గడ్డపై డెబ్యూ కెప్టెన్సీ చేయనున్న తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలవనున్నాడు. ఇంతకముందు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు విదేశీ గడ్డపై డెబ్యూ కెప్టెన్సీ చేశారు. డెబ్యూ వన్డే కెప్టెన్సీలో ఇద్దరూ సిరీస్ విజయాలు అందుకున్నారు. తాజాగా రాహుల్ ప్రొటీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను గెలిస్తే రహానే, ధావన్‌ల సరసన నిలవనున్నాడు. అంతకముందు సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో కోహ్లి గైర్హాజరీలో రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయింది. ఆ తర్వాత కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ పరాజయం పాలైన టీమిండియా 1-2 తేడాతో దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి టీమిండియా టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం వైరల్‌గా మారింది. చదవండి: ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇలా.. అయినా అందరి చూపు అతనివైపే..! Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' -
'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే
సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్ రాహుల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ స్థానంలో రాహుల్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించనున్నాడు. బుధవారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ప్రొటిస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికి.. కేఎల్ రాహుల్, పంత్, బుమ్రా లాంటి ఆటగాళ్లు కూడా పరిశీలనలో ఉన్నారు. చదవండి: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! చిట్‌చాట్‌లో భాగంగా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం మీకు వస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న రాహుల్‌కు ఎదురైంది. దీనిపై రాహుల్ వివరణ ఇస్తూ.. '' కోహ్లి టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకునేవరకు మాకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ కోహ్లి ఎప్పుడైతే నాయకత్వం నుంచి తప్పుకున్నాడో అప్పుడు వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. రోహిత్‌ను కాదని నన్ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేస్తే అది నాకు పెద్ద బాధ్యత అవుతుంది. ఎందుకంటే క్రికెట్లో కెప్టెన్‌గా దేశాన్ని నడిపించడం ఎవరికైనా ప్రత్యేకమే... నాకు ఎలాంటి మినహాయింపు ఉండదు. టెస్టు కెప్టెన్‌గా అవకాశం వస్తే నా మీద పెద్ద బాధ్యత ఉన్నట్లుగా ఫీలవుతా. ప్రస్తుతానికైతే రోహిత్ ఉన్నాడు కాబట్టి నాకు ఆ ఆలోచనలు లేవు. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మంచి బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతా. ఇక సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కోహ్లి భయ్యా దూరంగా ఉండడంతో తొలిసారి కెప్టెన్‌గా పనిచేశాను. ఆ మ్యాచ్ మేము ఓడిపోయినప్పటికి నాకు మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే. మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేకపోయినా.. కెప్టెన్‌గా కాస్త అనుభవాన్ని సంపాదించుకున్నా. ఇక ప్రొటీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు సవాల్. ఎలాగైనా సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం! -
షమీ చేతిలో సఫారీ సఫా.. 197 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం
సెంచూరియన్: పేసర్ మొహమ్మద్ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్ వైఫల్యంతో సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తెంబా బవుమా (52; 10 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బుమ్రా, శార్దుల్ చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 272/3తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (260 బంతుల్లో 123; 17 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్గిడి (6/71) భారత్‌ను దెబ్బ తీశాడు. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ (4) వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రాహుల్ (5), శార్దుల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. (చదవండి: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు) 69 బంతుల్లో 7 వికెట్లు... ఒకరోజు విరామం తర్వాత అనుకూల వాతావరణంలో ఆట మొదలు కాగా... భారత బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ చేరారు. తొలి రోజు జోరును కొనసాగించలేక టీమిండియా 55 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో రాహుల్, రహానే (48; 9 ఫోర్లు) వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. పంత్ (8), అశ్విన్ (4), శార్దుల్ (4) విఫలం కావడంతో భారత్ ఆశించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. 2018 సిరీస్ తరహాలో సెంచూరియన్‌లోనే ఎన్గిడి భారత్‌పై మళ్లీ ఆరు వికెట్లతో చెలరేగటం విశేషం. షమీ జోరు... భారత్ పేసర్ల ముందు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తేలిపోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఎల్గర్ (1)ను అవుట్ చేసిన బుమ్రా... ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే పీటర్సన్ (15)ను బౌల్డ్ చేసిన షమీ, కొద్ది సేపటికే మార్క్రమ్ (13)ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే డసెన్ (3)ను వెనక్కి పంపి సిరాజ్ కూడా వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ దశలో స్కోరు 32/4 వద్ద నిలవగా... బవుమా, డి కాక్ (34; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ప్రతిఘటించారు. సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే రాహుల్ క్యాచ్ వదిలేయడం డి కాక్కు కలిసొచ్చింది. ఆ తర్వాత చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ చక్కటి బంతితో డి కాక్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం శార్దుల్ ఓవర్లో బవుమా కొట్టిన మూడు ఫోర్లతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ను తప్పించుకుంది. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే బవుమా అవుట్ కాగా, చివర్లో రబడ (25) కొంత పోరాడగలిగాడు. షమీ తన కెరీర్లో ఆరో సారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. (చదవండి: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) డికాక్ (బి) రబడ 123; మయాంక్ (ఎల్బీ) (బి) ఎన్గిడి 60; పుజారా (సి) పీటర్సన్ (బి) ఎన్గిడి 0; కోహ్లి (సి) ముల్డర్ (బి) ఎన్గిడి 35; రహానే (సి) డికాక్ (బి) ఎన్గిడి 48; పంత్ (సి) డసెన్ (బి) ఎన్గిడి 8; అశ్విన్ (సి) మహరాజ్ (బి) రబడ 4; శార్దుల్ (సి) డికాక్ (బి) రబడ 4; షమీ (సి) డికాక్ (బి) ఎన్గిడి 8; బుమ్రా (సి) ముల్డర్ (బి) జాన్సెన్ 14; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (105.3 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–117, 2–117, 3–199, 4–278, 5–291, 6–296, 7–296, 8–304, 9–308, 10–327. బౌలింగ్: రబడ 26–5–72–3, ఎన్గిడి 24–5–71–6, మార్కో జాన్సెన్ 18.3–4–69–1, ముల్డర్ 19–4–49–0, మహరాజ్ 18–2–58–0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 1; మార్క్రమ్ (బి) షమీ 13; కీగన్ పీటర్సన్ (బి) షమీ 15; డసెన్ (సి) రహానే (బి) సిరాజ్ 3; బవుమా (సి) పంత్ (బి) షమీ 52; డికాక్ (బి) శార్దుల్ 34; ముల్డర్ (సి) పంత్ (బి) షమీ 12; జాన్సెన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 19; రబడ (సి) పంత్ (బి) షమీ 25; కేశవ్ మహరాజ్ (సి) అజింక్య రహానే (బి) బుమ్రా 12, ఎన్గిడి (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (62.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–2, 2–25, 3–30, 4–32, 5–104, 6–133, 7–144, 8–181, 9–193, 10–197. బౌలింగ్: బుమ్రా 7.2–2–16–2, సిరాజ్ 15.1–3–45–1, షమీ 16–5–44–5, శార్దుల్ 11–1–51–2, అశ్విన్ 13–2–37–0. -
బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు
Bumrah Stunning Delivery To Dean Elgar.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. 273/3తో పటిష్టంగా కనిపించిన టీమిండియా రాహుల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కేవలం 55 పరుగులు వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను చేజార్చుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే రాహుల్ సెంచరీతో మెరవడం, మయాంక్ అర్థసెంచరీ, రహానే 48 పరుగులతో రాణించడంతో టీమిండియా కాస్త చెప్పుకోదగ్గ స్కోరును చేయగలిగింది. చదవండి: AUS vs ENG: 18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఇక దక్షిణాఫ్రికాకు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు. ఒక పరుగు చేసిన కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను బుమ్రా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్ దిశగా బుమ్రా వేసిన ఐదో బంతిని ఎల్గర్ అనవసరంగా గెలుక్కున్నాడు. దీంతో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లడం.. కీపర్ పంత్ సూపర్ డైవింగ్‌తో క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఒక రకంగా టీమిండియాకు డీన్ ఎల్గర్ పెద్ద వికెట్ అని చెప్పొచ్చు. కెప్టెన్ ఔటైతే ఆ జట్టు ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండడంతో టీమిండియా బౌలర్లు ఎన్ని వికెట్లు పడగొడతారనేది చూడాలి. చదవండి: యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం India draws first blood, SA' s Captain, walks back to the pavilion #INDvsSA #SAvIND #IndianCricketTeam #DisneyPlusHotstarID #DisneyPlusHotstarTH #DisneyPlusHotstar pic.twitter.com/vyRVgqOwxh — Inian Kumar Ganesan (@Inian14) December 28, 2021 -
భజ్జీ రికార్డుపై కన్నేసిన అశ్విన్
ఢిల్లీ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు. శనివారం నుంచి రాంచీలో జరగనున్న మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలగా నిలుస్తాడు. భారత జట్టు తరపున దక్షిణాఫ్రికాపై ఇప్పటికే లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 21 టెస్టుల్లో 84 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ పేసర్ జగవల్ శ్రీనాథ్ 13 టెస్టుల్లో 64 వికెట్లతో రెండో స్థానంలో నిలవగా, భజ్జీ 11 టెస్టుల్లో 60 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 9 టెస్టుల్లో 52 వికెట్లు తీసీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాంచీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో మరో 9 వికెట్లు తీస్తే హర్బజన్సింగ్ని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటాడు. ఇక మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్‌పై 12 టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సిరీస్‌లో భారత్ సంపూర్ణాదిపత్యం ప్రదర్శిస్తూ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో టెస్టులోనూ గెలిచి దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసి టెస్టు చాంపియన్‌షిప్‌లో మరింత ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తుంది. కోహ్లిసేన ప్రస్తుతం 200 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.